స్మార్ట్ వాచ్.. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చే విషయం యాపిల్ కంపెనీకి చెందిన ఆధునిక సెల్ ఫోన్లు, వాచీలు.. ఎన్నో అధునాతనమైన ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తున్నారు కంపెనీ ప్రతినిధులు. అయితే ఖరీదు ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతానికి సంపన్నులు మాత్రమే ఇలాంటి యాపిల్ వాచీలను ధరిస్తున్నారు. ఇందులో చాలా ఫీచర్లు మనుషుల ప్రాణాలను కూడా కాపాడుతున్నాయి.. తాజాగా ఇలాంటి ఘటనే సింగపూర్ లో చోటుచేసుకుంది. మహమ్మద్ ఫిత్రి అనే వ్యక్తిని వేగంగా వచ్చిన ఓ వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయింది. దీంతో అతడి కిందపడిపోయాడు. అయితే అతడు ప్రమాదానికి గురైన సమయంలో.. తన చేతికి యాపిల్ వాచ్ ధరించి ఉన్నాడు. దీంతో యాపిల్ వాచ్ లోని హార్డ్ ఫాల్ అనే సర్వీస్ యాక్టీవ్ అయింది. ఎమర్జెన్సీ sos కు మెసెజ్ వెళ్ళింది. వెంటనే అప్రమత్తమైన ఎమర్జెన్సీ సర్వీసు అతడిని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడింది.
స్మార్ట్ వాచ్ వాచ్ ధరించి వుండే వ్యక్తి ఎప్పుడైనా సడన్ గా కిందపడిపోతే.. యాపిల్ వాచ్ లో వుండే హార్డ్ ఫాల్ సర్వీస్ యాక్టివ్ అయిపోతుంది. ఆ తర్వాత వాచ్ స్క్రీన్ పైన వచ్చే మెసేజ్ కి 45 సెకన్లలోపే స్పందించాల్సి ఉంటుంది. కానీ ప్రమాదానికి గురైన వ్యక్తి స్పందించలేదు కనుక.. అందులో నుంచి ఎమర్జెన్సీ సేవలకు, కుటుంబ సభ్యుల వివరాలు కనుక ఉంటే.. వాటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. యాపిల్ వాచీలో ఎమర్జెన్సీ సేవలతో పాటు ముఖ్యమైన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కూడా సేవ్ చేసుకునే వీలుంది. అదే ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుతుంది. అందుకే.. మీరు కూడా వీలైతే.. ఓ యాపిల్ వాచీని కొనుక్కొని అందులో ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ సేవ్ చేసుకోండి.