ఆరేళ్ళ పాప పిలుపు, నాన్న ప్రాణం కాపాడింది..

  0
  58825

  ఆరేళ్ళ కూతురు నాన్న అనే ఒక్క పిలుపు ఆ తండ్రి ప్రాణాలు కాపాడింది. అతి భ‌యంక‌ర‌మైన దోపిడీ ముఠా మ‌న‌సును క‌రిగించింది. అప్ప‌టివ‌ర‌కు అత‌న్ని చంపుదామ‌ని అనుకున్న కిరాత‌క గ్యాంగ్ పిస్ట‌ల్ తీయ‌బోయే ముందు ఆ పాప షాపులోకి వ‌స్తూనే… నాన్న అని పిల‌వ‌డంతో మ‌న‌సు మార్చుకుంది. ఫ‌రీదాబాద్‌లో ఓ వ‌డ్డీ వ్యాపార‌స్తుడి దుకాణంలోకి కిరాత‌క ముఠా ప్ర‌వేశించింది. అత‌నిని చంపి ఉన్న డ‌బ్బంతా దోచుకెళ్ళాల‌న్న‌ది ఆ ముఠా ప్ర‌య‌త్నం, తుపాకీ తీస్తుండ‌గా అప్పుడే ఆ వ్యాపారి కూతురు నాన్న అంటూ పిలుస్తూ దుకాణంలోకి వ‌చ్చింది. కాసేపు దుకాణంలోనే ఉన్న ఆ పాప తిరిగి వెళ్ళిపోయింది.అనంత‌రం దుండ‌గులు ఆ వ్యాపారిని చంప‌కుండా డ‌బ్బు మాత్రం దోచుకెళ్ళారు.

  అయితే వ్యాపారి పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డంతో, ద‌ర్యాప్తు చేప‌ట్టి ఆ న‌లుగురు స‌భ్యుల ముఠాను అరెస్టు చేశారు.”తాము వ్యాపారిని చంపి డ‌బ్బును దోచుకోవాల్సిన ప్ర‌య‌త్నించాం. కానీ అత‌ని కూతురు నాన్న అంటూ దుకాణంలోకి రాగానే, ఆ పిలుపు త‌మ మ‌న‌సును క‌ద‌లించింది. దీంతో అత‌నిని చంప‌కూడ‌దు అనే నిర్ణ‌యం తీసుకున్నాం. కేవ‌లం న‌గ‌దు మాత్రం దోచుకెళ్ళాం” అంటూ దోపిడీ ముఠా పోలీసుల‌కు విచార‌ణ‌లో చెప్ప‌డం గ‌మ‌నార్హం. కూతురి పిలుపు ఆ తండ్రిని కాపాడ‌డంతో పాటు దుండ‌గుల మ‌న‌సుల్లో మానవ‌త్వం మేలుకొల్ప‌డం నిజంగా గొప్ప విష‌యం.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..