కలిపి కట్టేసినా మారని మొగుడూపెళ్లాలు..

  0
  351

  మ‌న‌సులు క‌ల‌వ‌ని భార్యాభ‌ర్త‌లు క‌లిసి కాపురం చేయ‌లేక‌పోతే విడిపోవ‌డ‌మో..విడాకులు తీసుకోవ‌డ‌మో.. ఏదో ఒక‌టి జ‌రుగుతుంది. విడిపోయినా, విడాకులు తీసుకున్నా… మ‌ళ్ళీ క‌లుసుకునే జంట‌లు చాలానే ఉన్నాయి. అయితే ఓ జంట ప్ర‌పంచంలోనే విచిత్ర‌మైన ప‌రిస్థితుల్లో విడిపోయింది.

  ఉక్రేనియాకు చెందిన అలెగ్జాండ‌ర్ కుగ్లే, విక్టోరియా ఇద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు. ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. మూడేళ్ళ వివాహ‌బంధంలో నాలుగు సార్లు విడిపోయారు. నాలుగు సార్లు క‌లుసుకున్నారు. చివ‌ర‌కు వీరిద్ద‌రి క‌ల‌హాల కుంప‌టి భ‌రించ‌లేక కోర్టు.. ఓ విచిత్ర‌మైన తీర్పు చెప్పింది.

  ఈ తీర్పు అమ‌లు చేసేందుకు కొన్ని టీవీ చాన‌ళ్ళు కూడా ముందుకొచ్చాయి. అదేంటంటే, ఈ జంట ఇద్ద‌రినీ చేతుల‌కు క‌లిపి సంకెళ్ళు వేశారు. స్నానం చేయాల‌న్నా, వాష్ రూమ్ కి వెళ్ళాల‌న్నా, ఒక‌రి త‌ర్వాత ఒక‌రు చేయాల్సివ‌చ్చేది. విడిగా ప‌డుకోవాల్సిన ప‌రిస్థితి లేదు. వంట చేయాల‌న్నా, కాలు క‌ద‌పాల‌న్నా ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేయాల్సిందే.

  ఇలా 123 రోజులు ఇద్ద‌రూ చేతుల‌కు సంకెళ్ళు వేసుకునే కాలం గ‌డిపారు. చివ‌రి రోజున చాన‌ల్స్ ముందు సంకెళ్ళు విడ‌దీసిన త‌ర్వాత వారిద్ద‌రూ చెప్పిన మాట‌లు… ఇక మేమిద్ద‌రం క‌లిసి ఉండ‌లేం. శాశ్వ‌తంగా విడిపోతున్నాం అని చెప్పారు.

  123 రోజులు పాటు విడ‌దీయ‌లేని బంధం, త‌మ మ‌ధ్య ఇంకా పెద్ద అగాధాన్ని పెంచింద‌ని, ఇక పొర‌పాటున కూడా క‌లుసుకోమ‌ని చెప్పి క‌న్నీళ్ళ‌తో విడిపోయారు. వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..