భూమి 300 అడుగుల లోపలకు కుంగి పోయింది.

  0
  48

  ఒక్కోసారి ప్రకృతిలో విచిత్రాలు, అద్భుతాలు అవుతాయి. ఎంత శోధించినా కారణం తెలియదు. ప్రకృతి రహస్యమే అది. మెక్సికోలో కొద్దిరోజుల క్రితం భూమి 300 అడుగుల లోపలకు కుంగి పోయింది. అందరూ చూస్తుండగానే ఉన్నఫళంగా ప్యుబిలా రాష్ట్రంలో శాంటామేరియా జకాతపెక్ అనే చిన్న పట్టణ శివారులో ఈ సంఘటన జరిగింది. మొదట ఐదు గజాల గొయ్యి ఏర్పడి, ఆ తర్వాత అది రోజు రోజుకీ పెద్దదై, నాలుగు రోజుల్లో 75 గజాలకు పెరిగింది. 300 అడుగుల లోతులో పెద్ద గొయ్యిగా మారి, ఆ గోతినిండా నీళ్లొచ్చేశాయి.

  దీనికి సంబంధించిన వీడియోని కూడా భూగర్భ శాస్త్రవేత్తలు షేర్ చేశారు. ప్రస్తుతం ఆ గొయ్యి చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న ఇళ్లను కూడా ఖాళీ చేయిస్తున్నారు. భూగర్భంలో ఏర్పడే మార్పుల కారణంగా ఇంత పెద్ద గొయ్యి ఏర్పడిందని అధికారులు చెప్పారు. దీనిపై పరిశోధన చేసేందుకు ఇతర దేశాలనుంచి జియాలజిస్ట్ లు అక్కడికి వస్తున్నారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..