థర్డ్ వేవ్‌లో పిల్లలపై కూడా వైరస్ ప్రభావం చూపుతుందని వస్తున్న హెచ్చరికల నేపధ్యంలో ఫైజర్ వ్యాక్సిన్ ను 12 నుంచి 15 ఏళ్ళ మధ్య పిల్లలకు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. బ్రిటన్ మెడిసిన్స్ రెగ్యులేటరీ ఈ వ్యాక్సిన్ ను అనేక విధాలుగా పరీక్షించిన పిదప, ఈ టీకాను పిల్లలకు వేయొచ్చని నిర్ధారణకు వచ్చింది.
ఇప్పటికే పలు దేశాలు ఈ వ్యాక్సిన్ ను ఆమోదించగా మూరప్ దేశాలు, అమెరికా దేశాలు కూడా అంగీకరించాయి. ఈ టీకా వేయడం ద్వారా పిల్లలకు ఎలాంటి దుష్పభావాలు కలగబోవని తేల్చాయి. టీకా సామర్ధ్యం కూడా బాగుందని, టీకా సమర్థంగా పనిచేస్తుందని క్లినికల్ పరీక్షల ద్వారా నిర్ధారణ కావడంతో… 12 నుంచి 15 సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లలకూ ఫైజర్ వ్యాక్సిన్ లను యూరోపియన్, అమెరికా, బ్రిటన్ దేశాలు పచ్చజెండా ఊపాయి.