ష‌ర్మిల చేతికి నాన్న వాచ్ సెంటిమెంట్.

  0
  350

  దివంగ‌త నేత వైఎస్.రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేతి గ‌డియారం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అదృష్టం తెచ్చి పెట్టింది. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రోజున జ‌గ‌న్, వైఎస్సాఆర్ చేతి గ‌డియారాన్ని ధ‌రించారు. ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం ఒక ఎత్త‌యితే, వైఎస్సాఆర్ చేతి గ‌డియారాన్ని జ‌గ‌న్ ధ‌రించ‌డం మ‌రో ఎత్తు. ఆ వేళా విశేష‌మో లేక చేతి గ‌డియారం మ‌హ‌త్య‌మో తెలియ‌దు గానీ… రాజ‌న్న రాజ్య స్థాప‌న కోసం అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించి, నిరాటంకంగా కొన‌సాగిస్తున్నారు. ఇప్పుడు వైఎస్సాఆర్ త‌న‌య ష‌ర్మిల కూడా… ఆయ‌న చేతి గ‌డియారాన్ని ధ‌రిస్తూ క‌నిపించ‌డం విశేషం.

  రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి జులై 8న‌ ఆమె తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీని ప్రారంభించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ఆమె పార్టీ జెండాను రూపొందించింది. ఆదివారం ఉదయం లోటస్‌పాండ్‌లోని షర్మిల కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ మహోత్సవానికి సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ష‌ర్మిల ఆవిష్క‌రించింది. పార్టీ జెండాను తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట రంగులో రూపొందించడం గమనార్హం. జెండాలో 80 శాతం మేరకు పాలపిట్ట రంగు, మిగిలిన 20 శాతం నీలం రంగుతో ఉంది. ఇక జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులోనే వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చిత్రం ఉండేలా రూపొందించడం జ‌రిగింది. ఇదిలావుంటే వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఆవిర్భావ వేడుక‌ని హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని జేఆర్సీ సెంటర్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.