సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందానికి అందం… అభినయానికి అభినయం… ఏదైనా చూసి తీరాల్సిందే. మెచ్చుకుని అభినందించాల్సిందే. అయితే ఇటీవల నాగ్ చైతన్య, సమంతల వ్యవహారం మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇద్దరికీ పొసగడం లేదని, విడాకుల వరకు వ్యవహారం వెళ్ళిందని టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఇంతవరకు ఈ ఇద్దరిలో దీనిపై పెదవి విప్పలేదు. ఆ సంగతి పక్కన పెడితే.. సమంతపై బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కన్ను పడింది. మామూలుగా పడలేదు.. ఓ రేంజ్ లో కన్ను పడింది. అందుకు కారణం.. సామ్ అల్టిమేట్ యాక్టింగే…ది ప్యామిలీ-2తో వెబ్ సిరీస్ లోకి సమంత అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
నెగెటివ్ షేడ్స్ ఉన్న రాజీ పాత్రలో సామ్ జీవించేసింది. సినీ లవర్స్ నుంచే కాకుండా ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి కూడా బెస్ట్ విషెస్ అందుకుంది సమంత. ఇక ఈ సిరీస్ చూసిన షాహిద్ కూడా, ఆమె నటనకి ఫిదా అయిపోయాడట. సామ్ నటనతో ప్రేమలో పడిపోయానంటూ చెప్పుకొచ్చాడు. ఈ వెబ్ సిరీస్ మొత్తంలో తనను ఆకట్టుకుంది కేవలం సమంత మాత్రమే అంటే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆమెతో నటించాలని అనుకుంటున్నానని, ఒకవిధంగా ఇది నా డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చాడు. సామ్ తో నటించడం కోసం ఎదురుచూస్తున్నా అంటూ తన యాంగ్జయిటీని బయటపెట్టాడు. ప్రస్తుతం షాహిద్ ఇచ్చిన స్టేట్మెంట్ ని చూసి, సామ్ ఎలా రియాక్ట్ అవుతుందో… ఒక్కసారైనా చాన్స్ ఇస్తుందో లేదో చూడాలి.
ఇవీ చదవండి..