వికటించిన పెదాల ఆపరేషన్.. రకుల్ పరేషాన్..

    0
    2344

    హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. రకుల్ ఫేస్ మొత్తం మారిపోయింది. గతంలో ఉన్న గ్లామర్ పూర్తిగాకోల్పోయింది. దీనంతటికీ కారణం ఇటీవల ఆమె చేయించుకున్న సర్జరీయే అని తేలింది.

    అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం రకుల్‌ ఇటీవల తన పెదాలకు సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వ్యాయామంతో బక్కచిక్కి కళ తగ్గిపోయిన రకుల్‌ మరోసారి సర్జరీతో మరింత దారుణంగా మారిపోయిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో ఈ సర్జరీ వికటించడం వల్లే రకుల్‌ పెదాలు ఇలా మారిపోయాయి అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది హీరోయిన్లు అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం కాస్మోటిక్ స‌ర్జ‌రీలు చేయించుకుంటారన్న విషయం తెలిసిందే.

    గతంలో రకుల్‌ ముక్కకి కూడా సర్జరీ చేయించుకుందనే ప్రచారం ఉంది. దీంతో రకుల్‌ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా తయారైపోయింది అంటూ పలువురు ఆమె పాత ఫోటోలను పోల్చి చూస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రకుల్‌ ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్‌ చిత్రాల పైనే ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా కొండపొలం. ఈ సినిమా త్వరలోనే విడుదల కావాల్సి ఉంది.

    https://www.instagram.com/p/CULHzEJqQ5W/?utm_source=ig_web_copy_link

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.