చాన్స్ కావాలంటే ముందు ముద్దు సీన్ ట్రై చేద్దాం.

  0
  50

  క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంలో ఎంతోమంది హీరోయిన్లు త‌మ భ‌యాన‌క అనుభ‌వాల‌ను చెప్పుకొచ్చారు. ‘మీటూ’ ఉద్యమంతో ఎంద‌రో సెల‌బ్రిటీల భాగోతాల‌ను బైట పెట్టారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్‌ జరీన్ ఖాన్ తాను ఎదుర్కొన్న సంఘ‌ట‌న‌ల‌ను ఓ ఇంట‌ర్వూలో వెల్ల‌డించింది. ఓ కాల్ సెంటర్ లో పని చేస్తూ తాను బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నించానని… బాలీవుడ్ కు వచ్చిన తొలినాళ్లలో తనకు ఓ దర్శకుడు పరిచయం అయ్యాడని… ఓ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పాడ‌ని తెలిపింది.

  అయితే ఆ సినిమాలో ముద్దు సన్నివేశం ఉంటుందని… దానికి ముందుగానే రిహార్సల్స్ చేద్దామని తనను పిలిచి, చాలా అసభ్యంగా ప్రవర్తించాడ‌ని చెప్పుకొచ్చింది. అత‌ని నుంచి త‌ప్పించుకున్న త‌ర్వాత కూడా కొంత‌మంది సెల‌బ్రిటీలు త‌న‌ను వాళ్ళ దారిలోకి తెచ్చుకునేందుకు ట్రై చేశార‌ని చెప్పింది. అయితే వారి బారి నుంచి త‌ప్పించుకున్నాన‌ని వివ‌రించింది. బాలీవుడ్ హిట్ చిత్రాల్లో న‌టించిన జ‌రీన్‌… తెలుగులో గోపీచంద్ సరసన తెరకెక్కిన ‘చాణక్య’ సినిమాలో కూడా నటించింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..