చిన్న పిల్లలపై కోవిడ్ పంజా.. రుయాలో చికిత్స..

    0
    29

    క‌రోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే త‌గ్గుముఖం ప‌డుతుంద‌నుకుంటున్న ద‌శ‌లో ఓ షాకింగ్ న్యూస్. తిరుప‌తిలో ప‌లువురు చిన్న‌పిల్ల‌లు క‌రోనా సోకి చికిత్స పొందుతున్నారు. తాజాగా రుయా ఆస్ప‌త్రిలో 9 మంది చిన్న‌పిల్ల‌లు కోవిడ్ బారిన ప‌డి చికిత్స పొందుతున్నారు. అత్య‌వ‌స‌ర విభాగంలో చికిత్స అందిస్తున్నారు.

    న‌వ‌జాత శిశువు నుంచి ప‌ది, 12 సంవ‌త్స‌రాల పిల్ల‌ల వ‌ర‌కు సోకుతున్న పిల్ల‌ల‌కు క‌రోనా సోకుతుండ‌డంతో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. కోవిడ్ తో బాధ‌ప‌డుతున్న చిన్నారులు నెమ్మ‌దిగా కోలుకుంటున్నార‌ని డాక్ట‌ర్లు చెప్పారు. థ‌ర్డ్ వేవ్ పిల్ల‌ల‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌నుకుంటున్న ద‌శ‌లో… సెకండ్ వేవ్ లోనే పిల్ల‌లు కోవిడ్ బారిన ప‌డ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఇప్ప‌టికే సెకండ్ వేవ్ లోనే క‌రోనా బారిన ప‌డ్డార‌ని తేల‌డంతో. ఇది మ‌రింత ఆందోళ‌న‌క‌లిగించే అంశ‌మైంది.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..