కుప్పంలో ఎగిరిన జూనియర్ జెండా..

  0
  67

  చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఆయన జెండా ఎగురవేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్థానిక టీడీపీ జెండా దిమ్మెపై ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న జెండా ఎగరవేయడం గమనార్హం. ఇటీవల చంద్రబాబు పర్యటనలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాస్త హడావిడి చేశారని తెలుస్తోంది.
  జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు, సోషల్ మీడియా పోస్టింగ్ లు సహజమే. అయితే వ్యవహారం ఇప్పుడు బాగా ముదిరి జెండా వరకు వెళ్లింది. టీడీపీ వీరాభిమానులు తమకు పార్టీ కావాలి, పార్టీకి నాయకుడిగా ఎన్టీఆర్ ఉండాలి అనుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ కాని, ఆయన తరపున ఇంకెవరూ ఈ వ్యవహారంపై స్పందించలేదు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..