కత్తి మహేష్ ఎందుకు ..ఎలా చనిపోయాడు ..?

  0
  3065

  నెల్లూరు స‌మీపంలోని కొడ‌వ‌లూరు మండ‌లం చంద్రశేఖ‌ర‌పురం వ‌ద్ద వేకువ‌జామున జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. సీటు బెల్టు పెట్టుకోక‌పోవ‌డం వ‌ల్ల కారు పూర్తిగా నుజ్జునుజ్జ‌యి.. అందులో ఇరుక్కుని తీవ్ర గాయాల‌పాల‌య్యారు. కారు న‌డుపుతున్న డ్రైవ‌ర్ సీటు బెల్టు పెట్టుకోవ‌డంతో అత‌ను ఎలాంటి గాయాలు లేకుండా సుర‌క్షితంగా ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డాడు.

  బెలూన్ పైకి లేవ‌డంతో చిన్న గాయం కూడా డ్రైవ‌ర్ కి కాలేదు. అయితే సీటు బెల్టు పెట్టుకోక‌పోవ‌డంతో క‌త్తి మ‌హేష్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దీంతో ఆయ‌న‌ను నెల్లూరులోని ప్రైవేట్ ఆస్ప‌త్రిలో ట్రీట్మెంట్ కోసం చేర్పించారు. అయితే ఆయ‌న ప‌రిస్థితి తీవ్రంగా ఉండ‌డంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైయ్ కి త‌ర‌లించారు. చెన్నైయ్ లో క‌త్తి మ‌హేష్ త‌ల‌కు, కంటికి తీవ్ర‌మైన గాయ‌మైన‌ట్లు గుర్తించారు. మెద‌డులో ర‌క్త‌స్రావం కూడా జ‌రిగింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆ ప్ర‌మాద తీవ్ర‌త‌కు త‌ల ప‌గిలి పుర్రెలో భాగంలో ఎముక భాగాలు కొన్ని మెద‌డులో గుచ్చుకున్నాయి.

  దీంతో ఆయ‌న‌కు ఆప‌రేషన్ చేసి వాటిని తొల‌గించారు. అప్ప‌టి నుంచి క‌త్తి మ‌హేష్ వెంటిలేట‌ర్ మీద‌నే ఉన్నారు. కంటికి తీవ్ర గాయం కావ‌డంతో, దానికి కూడా ఆప‌రేష‌న్ చేశారు. ఆప‌రేష‌న్ జ‌రిగిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ప‌రిస్థితి ఆందోళ‌నక‌రంగానే ఉన్న‌ప్ప‌టికీ, నిల‌క‌డ‌గా ఉంద‌ని డాక్ట‌ర్లు చెబుతూ వ‌చ్చారు.

  అయితే ఆయ‌న‌ను నెల్లూరు నుంచి త‌ర‌లించే ముందే ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా ఉంద‌ని చెప్పే పంపించారు. చెన్నై ఆస్ప‌త్రిలోనైనా ఆయ‌న కోలుకుంటార‌ని ఆయ‌న స్నేహితులు, స‌న్నిహితులు భావించారు. క‌త్తి మ‌హేష్ ను బ‌తికించుకోవాల‌ని వారు కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు ప్ర‌మాదం జ‌రిగిన 15వ రోజుల త‌ర్వాత చికిత్స పొందుతూ ఆయ‌న మృతి చెందారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.