కొరమీను కాదు, పొలస కాదు.. ఇది బాహుబలి చేప..

  0
  1455

  సముద్రంలో తప్ప ఈ స్థాయి భారీ చేపలు జలాశయాల్లో కనపడటం అరుదు. ఒకవేళ ఉన్నా.. వాటిని సజీవంగా పట్టుకోవడం జాలర్లకు అసాధ్యమే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ ఇలాంటి చేపలు ఏ వలకూ చిక్కలేదు. తొలిసారి 30కేజీల బరువుండే ఈ భారీ చేపను నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణా కలాన్ శివారులో ఉన్న అలీసాగర్ జలాశయంలో పట్టుకున్నారు. 30కేజీల చేప పడే సరికి మత్స్యకారులు షాకయ్యారు. బొచ్చె రకానికి చెందిన ఈ చేపను పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు.

  సాధారణంగా చిన్నపాటి జలాశయంలో, చెరువుల్లో ఐదు నుంచి పది కిలోల వరకు బరువు ఉన్న చేపలు దొరకడమే చాలా అరుదు. అలాంటిది ఏకంగా 30 కిలోల బరువు ఉన్న చేప దొరికితే? చేపలు పట్టే మత్స్యకారుల్లో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వారు ఎగిరి గంతేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు అన్ని చెరువులు, జలాశయాల్లోనూ చేపలు ఎక్కువలో ఎక్కువగా 15 కిలోల వరకు బరువు పెరుగుతాయి. కానీ ఈ జలాశయంలో మాత్రం ఊహించని రీతిలో భారీ చేప దొరికింది. భారీ చేప వలకు చెక్కిడంతో మత్స్యకారులకు కాసుల పంట పండింది.

  అలీసాగర్ ఈ జలాశయంలో దాదాపు అన్నీ 5 నుంచి 10 కేజీల మధ్య బరువున్న చేపలు ఉంటాయన్నారు మత్స్యకారులు. ఇప్పటి వరకు దొరికిన చేపలు కూడా అంతే సైజ్‌లో ఉండేవన్నారు. ఈ జలాశయంలో ఇలాంటి భారీ చేపలు చాలా అరుదుగా దొరుకుతాయని పేర్కొన్నారు. కాగా, తొలిసారి భారీ చేప వలకు చిక్కడంతో విషయం అంతటా పాకింది. ఆ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. చాలా మంది ప్రజలు జలాశయం వద్దకు ఆ చేపను చూసేందుకు వచ్చారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.