గూగుల్లో ఇవి వెదికితే పోలీసులు ఇంటికొస్తారు

  0
  4575

  మీ సెల్ ఫోన్లో పోర్న్ చూస్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే.. ఇక నుంచి పోర్న్ చూసే అలవాటు ఉంటే మానుకోండి.. లేదంటే, ఏదో ఒకరోజున పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. నేటి రోజుల్లో ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డేటా కూడా తక్కువ ధరకే లభిస్తుండటంతో యూట్యూబ్ వీడియోలు, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటివి ఇష్టానుసారం వాడేస్తున్నారు. వీటికి తోడు ఒంటరిగా ఉండే యువకులు అదేపనిగా పోర్న్ చూస్తున్నారు.

  ఇటీవల పోర్న్ చూడటం ఎక్కువయ్యే సరికి యువకులు పెడదారి పడుతున్నారు. పోర్న్ సైట్లు చూడటం అలవాటు చేసుకుని తమ పక్కనున్న స్నేహితులను కూడా చెడగొడుతూ చెడు దారుల్లోకి వెళ్తున్నారు. అయితే ఇలా పోర్న్ చూసే యువతకు ఖంగుతినే వార్తను చెప్పింది కేంద్ర హోంశాఖ. ఎవరైతే పోర్న్ చూస్తున్నారో వారి ల్యాప్ టాప్, మొబైల్.. ఐపీ చిరునామా ఆధారంగా నిందితులను గుర్తించి ఆయా రాష్ట్రాలకు నివేదికలు పంపుతుందట కేంద్ర హోంశాఖ.

  ఇక ఇలాంటి నీలి చిత్రాల వెబ్ సైట్ లను చూస్తున్నవారిని కూడా జాతీయ నేర గణాంక సంస్థ గుర్తిస్తుందట. ఇప్పటి వరకూ కొంతమందిని గుర్తించటంతో పాటు 1,095 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఇలా రెండు మూడేళ్ల నుంచి హైదరాబాద్ లోనే దాదాపుగా 36 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసినవారికి భారీగా జరిమానాలు విధించి.. జైలు శిక్షలు కూడా విధిస్తారని తెలుస్తోంది. అశ్లీల వీడియోల ప్రభావం కారణంగా చిన్నారులపై, మైనర్లపై అకృత్యాలు పెరుగుతున్నాయని దీని కారణంగానే కేంద్ర హోంశాఖ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని తెలుస్తోంది. సో.. ఇక నుంచి పోర్న్ చూడాలంటే కాస్త వెనకా ముందూ ఆలోచించండి..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.