చెత్త ట్రాఫిక్ నగరాల్లో మనమే టాప్..

    0
    384

    జనాభా పెరిగి, నగరాలు పెరిగి దానికి తగ్గట్టుగా వాహనాలు పెరిగి ప్రపంచం వాహనాల కీకారణ్యంగా మారిన 36 నగరాల్లో ఛేదింజలేని ట్రాఫిక్ పద్మవ్యూహం ఉన్న నగరం ఏంటో తెలుసా..? ప్రపంచంలోనే ఇలాంటి 36 ట్రాఫిక్ కీకారణ్య నగరాల్లో భారత్ దేశంలో 3 నగరాలు చోటు సంపాదించుకున్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి క్లిష్టమైన ట్రాఫిక్ ఉండే నగరంగా బాంబేకు ప్రథమ స్థానం దక్కింది.

    ఆ తర్వాత ప్రపంచంలోనే మూడో స్థానంలో ఢిల్లీ, 12వ స్థానంలో బెంగళూరు ఉన్నాయి. భారత దేశంలోని 3 నగరాలు ప్రపంచంలోని 36 నగరాల ట్రాఫిక్ కీకారణ్యంలో టాప్ లిస్ట్ లోనే ఉంటున్నాయి. బ్రిటన్ లోని కియా కార్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ట్రాఫిక్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

    రోడ్ల నాణ్యతలో, ట్రాఫిక్ నిర్వహణలో మెయిన్ రోడ్ల ఆక్రమణలు, డ్రైనేజీ వ్యవస్థ, ఇటువంటి వాటిలో గరిష్టంగా 10మార్కులకు గాను ముంబైకి 7, ఢిల్లీకి 5, బెంగళూరుకి 4 మార్కులు దక్కాయి. ప్రపంచంలో హ్యాపీగా వాహనాలు డ్రైవ్ చేయగల సిటీ పెరూ రాజధాని లిమా మాత్రమే. వర్షాలు వస్తే అడుగు బయటపెట్టలేని వాహనం బయటకు తీయలేని సిటీల్లో కూడా భారత దేశంలోని పట్టణాలే ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉన్నాయి.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.