ఇలాంటి తండ్రిని ఏం చేయాలి..?

  0
  19305

  కన్నతండ్రి. బిడ్డల్ని కంటికి రెప్పల్లా చూడాల్సిన బాధ్యత ఉన్న తండ్రి. అందులోనూ ఆడపిల్ల. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన ఇంటి మహాలక్ష్మి. కానీ ఆ తండ్రి కర్కోటకుడు. రెండో భార్య ముందు సొంత బిడ్డను దారుణంగా హింసించాడు. పైశాచికానందం పొందాడు. ఆ దుర్మార్గురాలు కూడా బిడ్డను కొడుతుంటే కనీసం అడ్డుపడలేదు సరికదా నవ్వుతూ కూర్చుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెదక్ జిల్లా కలెక్టర్ స్పందించారు. మెదక్ మున్సిపాల్టీలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఆ నీఛుడు నాగరాజుపై చర్యలకు ఉపక్రమించారు. తండ్రి చేతులో కష్టాలపాలైన బిడ్డను సఖి సెంటర్ కు తరలించారు.

  గతంలో చిత్తూరులో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే అక్కడ ఓ తల్లి ప్రియుడితో ఉండేందుకోసం తన కొడుకునే చిత్రహింసలు పెట్టింది. ఆ వీడియోలను తన భర్తకు పంపించి రాక్షసానందం పొందింది. తల్లిదండ్రుల్లో ఇలాంటి నేర ప్రవృత్తి, అది కూడా సొంత బిడ్డలపై దారుణంగా దాడిచేయడం అమానుషం.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.