సమంత ఆ ముక్క ఎందుకు చెప్పలేకుంది.. ?

  0
  3590

  టాలీవుడ్ బెస్ట్ యంగ్ కపుల్ లిస్టులో అక్కినేని నాగచైతన్య, సమంత జంట ముందుంటుంది. సుదీర్ఘ ప్రేమాయ‌ణం త‌ర్వాత పెళ్లి పీట‌లెక్కిన ఈ జంట.. ఎలాంటి వివాదాలు లేకుండా జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తోంది. ఇటు వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూనే, వృత్తిపరంగా రాణిస్తున్న విష‌యం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే భ‌ర్త చైతూ కంటే సామ్.. నాలుగు రాళ్ళు ఎక్కువే సంపాదిస్తోంది. అయితే ఈ ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. సమంత, తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ‘సమంత అక్కినేని’ అనే పేరు తీసేసి.., జస్ట్ ‘ఎస్’ అని మాత్రమే పెట్టుకోవడంతో ఈ రచ్చ షురూ అయ్యింది.

  ఇటీవ‌ల నాగచైతన్య తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’ ప్రోమో సోషల్ మీడియాలో విడుదలైతే, ఈ మూవీ టీమ్‌కి సమంత…, ‘విన్నర్’ అంటూ విషెస్ చెప్పింది. ఆ ట్వీట్‌లో సాయి పల్లవి పేరు ప్రస్తావించింది తప్ప, హీరోగా న‌టించిన‌ చైతూ పేరు ప్రస్తావించక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ పుకార్ల‌కు ఆజ్యం పోసిన‌ట్ల‌యింది. అయితే సమంత తన సినిమాకి ‘విన్నర్’ అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పడంపై స్పందించిన చైతూ, ‘థ్యాంక్యూ సామ్’ అని కృతజ్ఞతలు చెప్ప‌డంతో ఆ వేడి, కాస్త‌ చ‌ల్లారిన‌ట్ల‌యింది.

  ఇక రెండురోజుల క్రితం స‌మంత క‌లియుగ‌దైవం వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకుంది. ద‌ర్శ‌నానంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమెను ఓ మీడియా వ్య‌క్తి… చైతూ, సామ్ ల‌పై వ‌స్తున్న ఈ రూమ‌ర్స్ పై స్పందించాల‌ని అడిగాడు. దీంతో చిర్రెత్తిపోయిన సామ్‌… గుడికొచ్చా.. బుద్ధుందా! అంటూ స‌ద‌రు వ్య‌క్తిపై మండిప‌డింది. బుద్ది త‌క్కువై ఆ వ్య‌క్తి అడిగాడంటే స‌రే… మ‌రి సామ్.. అంత సీరియ‌స్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవ‌స‌రం ఏముంది ? అనేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌.

  ఇక తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న స‌మంత‌, ఆ త‌ర్వాత శ్రీకాళ‌హ‌స్తీశ్వ‌రుడిని ద‌ర్శించుకున్నారు. ముక్కంటి సేవ‌లో పాల్గొన్నారు. రుద్రాభిషేకం చేయించారు. రాహుకేతు పూజ‌లు చేశారు. భ‌ర్త లేకుండా ఇలాంటి పూజ‌లు చేయ‌డంపై కూడా భిన్న‌వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన పుకార్ల‌కు ఇది మ‌రింత బ‌లం చేకూరుస్తున్నాయి. గ‌తంలో కూడా హీరో సిద్దార్ధ‌తో ప్రేమాయ‌ణం సాగించిన సామ్‌.. ఆ త‌ర్వాత విబేధాలు రావ‌డంతో.. ఇలాగే శ్రీకాళ‌హ‌స్తిలో పూజలు చేసింది. ఇప్పుడు వ‌స్తున్న పుకార్ల నేప‌ధ్యంలో స‌మంత ఇలాగే పూజ‌లు చేయ‌డంపై అనుమానాలకు మ‌రింత తావిస్తోంది. పైగా పుకార్ల‌కు బ‌లం చేకూరుస్తున్న‌ట్ల‌యింది. చాలారోజుల నుంచి ఇలాంటి పుకార్లు వ‌స్తున్నా.. ఇప్ప‌టివ‌ర‌కు దీనిపై స‌మంత స్పందించ‌క‌పోవ‌డం ఆశ్వ‌ర్చ‌క‌రం.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.