పాక్ లో పిఎఎస్ కి ఎంపికైన హిందూ యువతి..

  0
  107

  దాయాది దేశం పాకిస్తాన్ లో హిందూ యువ‌తి రికార్డు క్రియేట్ చేసింది. పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్ కు సనా రాంచంద్ గుల్వానీ ఎంపిక‌య్యారు. తొలి ప్ర‌య‌త్నంలోనే ఆమె ఈ ఘ‌న‌త సాధించ‌డం విశేషం. ఈ ఏడాది జరిగిన సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ పరీక్షల్లో పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా కేవలం 2 శాతం అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. అందులో ఒక‌రే స‌నా రాంచంద్‌. పాకిస్థాన్ లో హిందువులు మైనార్టీలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి అత్యున్నత ఉద్యోగాల్లోకి మైనార్టీలు వెళ్లడం అత్యంత కష్టం. అయిన‌ప్ప‌టికీ ఆమె ఈ ఘ‌న‌త సాధించి రోల్ మోడ‌ల్ గా నిలిచింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.