విడిపోయాం.. కారణాలు సీక్రెట్ . అడగొద్దు..

  0
  802

  అక్కినేని నాగచైతన్య, సమంతల వైవాహిక జీవితం ముగిసింది. తామిద్దరం విడాకులు తీసుకోబోతున్నట్టు నాగచైతన్య, సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.  ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వీరిద్దరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. చాలా మాధ్యమాల్లో కొన్ని వందల వార్తలు వీరిద్దరిపై వచ్చాయి. అయితే సమంత, నాగచైతన్య మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ చివరికి మీడియా అనుకున్నట్టుగానే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు..

  ‘‘మాశ్రేయోభిలాషులందరికీ.. ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. పదేళ్లుగా మా స్నేహం కొనసాగినందుకు మేం అదృష్టవంతులం. మా స్నేహం వివాహ బంధానికి చాలా కీలకంగా నిలిచింది. ఇప్పుడు ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’’ అంటూ ముగించారు సమంత రూత్ ప్రభు.. నాగచైతన్య అక్కినేని..

  నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం గత ఆరు నెలలుగా నలుగుతుంది. ఇప్పుడు విడాకులకు 50కోట్ల రూపాయలకు సెటిల్మెంట్ జరిగినట్టు చెబుతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. సమంత హైదరాబాద్ నుంచి కూడా మకాం మార్చేసింది.గత కొంతకాలంగా నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపై పుకార్లు మొదలయ్యాయి. సమంత తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి అక్కినేని అనే ఇంటిపేరుని తీసేసింది. అప్పట్లోనే ఆమెను అభిమానులు ప్రశ్నించగా అస్సలు సమాధానమే చెప్పలేదు. ఆ తర్వాత నాగేశ్వరరావు జయంతి సందర్భంగా వేసిన ట్వీట్ లో కూడా నాగార్జునను మామయ్య అని సంబోధించలేదు. ఆ తర్వాత కొంతసేపటికి ఆ ట్వీట్ తీసేసి మరో ట్వీట్ వేసింది. ఇక లవ్ స్టోరీ సినిమా విడుదల సమయంలో కూడా ట్వీట్ల వ్యవహారం రచ్చకెక్కింది. నాగచైతన్యకు కాకుండా సాయి పల్లవికి విషెస్ చెబుతూ సమంత ట్వీట్ వేయడం సంచలనంగా మారింది. లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సైతం చైతన్య సమంత గురించి మాట్లాడటమే మానేశారు. ఓ దశలో అదో చేదు జ్ఞాపకం అంటూ పరోక్షంగా హింట్ ఇచ్చారు.


  ఇక సమంత కూడా ఇటీవల తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు మీడియా అడిగిన ప్రశ్నలకు ఆగ్రహం వ్యక్తం చేసింది కానీ అసలు విషయం దాటేసింది. శ్రీకాళహస్తి పూజల్లో కూడా పతి దేవుడు లేకుండానే పాల్గొంది. సమంత ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో నటించింది. ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ లో బాగా క్రేజ్ పెరిగింది. దీంతో ఒకరకంగా సమంత చైతన్యకంటే బాగా పాపులర్ అయింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ లైఫ్ పేరుతో సినిమాలకు, ఇండస్ట్రీకి దూరంగా ఉండటం సమంతకు ఇష్టం లేదు. అందుకే ఆమె వేరుగా ఉండటానికి ఇష్టపడిందని తెలుస్తోంది.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.