కీచక ముఠాని పోలీసులు పట్టేశారు..

  0
  84

  కీచక ముఠాని పోలీసులు పట్టేశారు..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. వీరిలో నలుగురు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ఆధారంగా ఈ కీచక ముఠాని పట్టుకున్నారు.

  రేపిస్ట్ ల ఫొటోలు ఆధారంగా అన్ని రాష్ట్రాల పోలీసులు అలర్ట్ అయ్యారు. తాజాగా వీరిలో ఒకడు బంగ్లాదేశ్ కి చెందిన రితఫుల్ ఇస్లాంగా గుర్తించారు. హిద్రోయ్ బాబు అనే పేరుతో ఇతను అక్కడ టిక్ టాక్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు అతని ప్రొఫైల్ ఆధారంగా.. అతనితో టచ్ లో ఉన్న మిగతావారి వివరాలు సేకరించారు. మొత్తం ఆరుగురిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

  అత్యాచారానికి గురైన యువతి కూడా బంగ్లాదేశ్ కి చెందినవారే కావడం విశేషం. వీరంతా అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించారు. నిందితులంతా వ్యభిచార ముఠాకు చెందినవారని, అమ్మాయిలను అక్రమంగా ఇండియాలోకి తీసుకొచ్చి పడుపు వృత్తిలో దింపేవారని తేలింది. అయితే ఇలా రేప్ చేస్తూ వీరి వీడియో వైరల్ కావడంతో అందరూ కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. 22 ఏళ్ల బాధితురాలిని కూడా ఇలాగే బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చి పడుపు వృత్తిలో దించడానికి ప్రయత్నించారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..