ఈ వైరస్ మానవ సృష్టే…తేల్చేశారు..

    0
    96

    కరోనా వైరస్ చైనా శాస్త్రవేత్తల సృష్టేనని, ఇందులో ఎటువంటి సందేహం, సంశయం లేదని ఇద్దరు ప్రముఖ వైరాలజిస్ట్ లు స్పష్టం చేశారు. సుదీర్ఘ పరిశోధనల తర్వాత చైనాలో మానవ సృష్టితో ఈ కరోనాను ప్రపంచం మీదకు వదిలారని బ్రిటిష్ ప్రొఫెసర్ యాంగర్స్ డెల్గీస్, నార్వే సైంటిస్ట్ డాక్టర్ బ్రిగర్ పేర్కొన్నారు. కొవిడ్ 19 వైరస్ పై ప్రత్యేకమైన మానవ వేలు గుర్తులకు సంబంధించిన జీన్స్ ని కనుగొన్నామని చెప్పారు.

    అందువల్ల ఈ వైరస్ ను గబ్బిలాల్లో ఉన్న మూల వైరస్ నుంచి ప్రమాదకరంగా మరింత ఉధృతంగా వ్యాప్తిచెంది, మారణహోమానికి దారితీసే వైరస్ గా మార్పులు చేసి వదిలారని తేల్చారు. మూల వైరస్ నుంచి దాన్ని వెన్నెముక లాంటి భాగాన్ని కిరీటం ఆకారంలో మార్పు చేసి దాని జన్యువుల్లో వేగంగా వ్యాప్తి చెందే విధంగా మార్పులు చేసి, రివర్స్ బయో ఇంజినీరింగ్ ప్రాసెస్ లో దీన్ని సృష్టించారని తెలిపారు.

    ఇప్పటి వరకు చైనా, ఇది మానవ సృష్టి అన్న వాదనకు సరైన సమాధానం కూడా చెప్పడంలేదని తెలిపారు. ఇప్పుడు కరోనా వైరస్ పై వేలి ముద్రల జన్యుపదార్థాలను తాము కనుగొన్న తర్వాత, చైనా తప్పించుకోలేదని, ప్రపంచానికి సమాధానం చెప్పి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. కొవిడ్ 19 వైరస్ ఏ జీవినుంచి వచ్చింది? దానికి మూలం ఏమిటన్న ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం లేదని తెలిపారు.

    అందువల్ల కచ్చితంగా ఇది లేబరేటరీ లోనే తయారైన వైరస్ అని, ఇదేదో పొరపాటుగా చేసిన జన్యు ప్రక్రియలో ఉద్భవించిన వైరస్ కాదని స్పష్టం చేశారు. ఇది గబ్బిలాల ద్వారానో, మరే ఇతర జంతువుల ద్వారానో, లేదా కీటకాల ద్వారానో మార్కెట్ నుంచి వచ్చి ఉంటే, దీన్ని అదుపు చేయడం చాలా సులభం అని, ఇది లేబొరేటరీలో సృష్టించిన వైరస్ కాబట్టి, మూల వైరస్ లో జన్యుమార్పిడి జరిగిన వైరస్ కాబట్టి, దీన్ని అంత తేలిగ్గా నిర్మూలించలేమని స్పష్టం చేశారు. అందువల్ల ముమ్మాటికీ ఈ వైరస్ వుహాన్ లేబొరేటరీ శాస్త్రవేత్తల సృష్టి, కుట్ర అని తేల్చారు. బహుశా తమ పరిశోధన నివేదికే చివరిదని కూడా స్పష్టం చేశారు.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..