హీరో విజయ్ కి కోర్టు షాక్ దిమ్మతిరిగింది.,

  0
  7781

  మీరేదో సినిమా హీరోలు .. సినిమాల్లో అవినీతిపై పోరాటం అంటూ ఇరగదీస్తారు.. నిజజీవితంలో మీరిలాంటివాళ్ళు అని తెలిసింది.. అంటూ మద్రాస్ హైకోర్టు తమిళ హీరో విజయ్ కి చీవాట్లు పెట్టింది.. తప్పుడు పిటీషన్ తో కోర్టుకు వచ్చినందుకు లక్ష రూపాయల ఫైన్ విధించింది.. అసలు విషయం ఏమిటంటే .. విజయ్ 10 కోట్ల రూపాయలు విలువజేసే రోల్స్ రాయిస్ కారుని లండన్ నుంచి దిగుమతి చేసుకున్నాడు. దీనికి ఆర్టీఏ అధికారులు ఎంట్రీ టాక్స్ కట్టమన్నారు. టాక్స్ కట్టలేనని విజయ్ తరపున న్యాయవాది కోర్టులో పిటీషన్ వేశారు. దీంతో వళ్ళుమండిన జడ్జి చీవాట్లు పెట్టారు. మీరేమో , హీరోలని అనుకుంటారు.. లక్షలాదిమంది అభిమానులు ఉంటారు. సినిమాల్లో అక్రమాలపై పోరాటం అంటారు. ఇదేనా మీ నిజ స్వరూపం.. 10 కోట్లు పెట్టి కారు కొని , దానికి చట్టప్రకారం కట్టాల్సిన పన్ను కట్టకుండా కోర్తుకొస్తారా.. అంటూ నిలదీశారు. ముందు ఎంట్రీ టాక్స్ కట్టండి.. ఇలాంటి పిటీషన్ తో కోర్టుకొచ్చినందుకు లక్ష రూపాయలు , సీఎం కరోనా రిలీఫ్ ఫండ్ కి చెల్లించండి అంటూ తీర్పు చెప్పారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.