వీర్యకణాలపై కొవిడ్ వ్యాక్సిన్ ప్రభావం ..?

    0
    2520

    కొవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే మగవాళ్లలో వీర్య కణాలు తగ్గుతాయా..? సంతానోత్పత్తిపై ఇది ప్రభావం చూపుతుందా? ముఖ్యంగా ఫైజర్, మోడర్నా కొవిడ్ టీకాలు మగవారిలో వీర్య కణాలపై ప్రభావాన్ని చూపిస్తాయన్న గతంలో జరిగిన ప్రచారాలపై విస్తృతమైన పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనలో 18 నుండి 50 ఏళ్ల వయసున్న పురుషుల్ని ఎన్నుకున్నారు. వ్యాక్సిన్ వేయకముందు, వేసిన తర్వాత వారిలో వీర్య కణాల ఉత్పత్తి, సంఖ్యను పరిశీలించారు. వారిపై ప్రయోగాలు జరిపి, వీర్య కణాల ఉత్పత్తికి, కోవిడ్ వ్యాక్సిన్ కి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. వ్యాక్సిన్ వేశాక అది వీర్యకణాలపై ఎలాంటి ప్రభావం చూపడంలేదని తేల్చారు.

    వ్యాక్సిన్ వేయకముందు వారి వీర్య కణాలు ఆరోగ్యవంతంగా ఉన్నాయని తేలిన తర్వాతే వారిని ఈ ప్రయోగాలకు ఎన్నుకున్నారు. 90రోజుల లోపు, 90రోజుల తర్వాత ఇలా వారిపై రెండు రకాలుగా పరిశోధనలు చేశారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మొదటి డోసు, రెండో డోసుల్లో కూడా వీర్య కణాలు సేకరించారు. వీర్య కణాల విశ్లేషణలో శిక్షణ పొందిన ఆండ్రాలజిస్ట్ లను ఎంపిక చేసారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శక సూత్రాల ప్రకారమే ఈ ప్రయోగాలు చేశారు. ఇదిలా ఉండగా కొంతమందిలో వ్యాక్సిన్ వేసిన తర్వాత వీర్యం పరిమాణంలో కానీ, వీర్య కణాల కదలికలో కానీ ఆరోగ్యవంతమైన మార్పులొచ్చాయని గుర్తించారు. వ్యాక్సిన్ లోని M-RNA వల్ల వీర్యం మరింత ఆరోగ్యవంతంగా తయారయ్యే అవకాశం ఉందని తేల్చారు. దీంతో కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల అది వీర్యకణాలపై ప్రభావం చూపిస్తుందన్న మాట పక్కనపెడితే వీర్యకణాల కదలికకు అధిక వీర్యం ఉత్పత్తికి దానిలోని M-RNA మరింత దోహద పడుతుందని తేలింది.

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..