డబ్బులు తీసుకోను గానీ.. సుఖీభవ.. సుఖీభవ..

  0
  3155

  సోషల్ మీడియా ఎవరిని, ఎప్పుడు సెలెబ్రిటీలుగా చేస్తుందో ఎవరూ చెప్పలేరు. చాలామంది సోషల్ మీడియా క్రేజ్ తో రాత్రికి రాత్రే స్టార్ లుగా మారిపోతారు. ఇలా ఎంతో మంది టిక్ టాక్ వంటి యాప్ ల కారణంగా సెలెబ్రిటీలుగా మారిపోయారు. తాజాగా మరో యువకుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.

  రెడ్ లేబుల్ టీ ప్రచారంలో భాగంగా గత కొద్దిరోజుల క్రితం ఓ ప్రకటనను రూపొందించారు. అందులో ఓ హిజ్రా టీ షాపు ప్రారంభిస్తుంది. పక్కనే కారులో ఉండే మహిళకు.. ఆ విషయం చెప్పి.. టీ ఇస్తుంది.. టీ తగిన అనంతరం హిజ్రాకు మహిళ డబ్బులు ఇవ్వబోతుంటే.. అయ్యయ్యో వద్దమ్మా.. అంటూ హిజ్రా తిరస్కరిస్తుంది. అనంతరం ఆ మహిళ, హిజ్రాను సుఖీభవ అంటూ దీవిస్తుంది..ఇది రెడ్ లేబుల్ ప్రకటనలోని సారాంశం.. అయితే దీనిని కూడా తీన్మార్ బ్యాండ్ లో వాడేశాడు ఓ హైదరాబాద్ కుర్రాడు..

  కొద్దిరోజుల నుంచి ఈ యువకుడి తీన్మార్ స్టెప్పులు విపరీతంగా షేర్ అవుతున్నాయి. సుఖీభవ.. సుఖీభవ అంటూ మీమ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ లలో కూడా ఈ సుఖీభవ కాన్సెప్ట్ నెటిజన్లను విపరీతంగా నవ్విస్తోంది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.