మనిషి చేసే పనులను కూడా మెషీన్లు, రోబోలు చేసేస్తున్నాయి. చివరికి సర్వ్ చేసే విషయంలోనూ అవే ముందుంటున్నాయి. ఇదంతా టెక్నాలజీ మహిమే. రోజురోజుకీ పెరుగుతున్న టెక్నాలజీతో మనిషికి పని తగ్గిపోయింది. ఇప్పుడు డ్రోన్లు కూడా సర్వ్ చేసేస్తున్నాయి. మనదేశంలో ఈ ట్రెండ్ ఎక్కడో ఒకటీ అర జరుగుతున్నా… ఫారిన్ కంట్రీస్ లో మాత్రం డ్రోన్లు సర్వీస్ చేస్తున్నాయి. మనకు ఇక్కడ డెలివరీ బాయ్స్ ఎలాగో… అక్కడ డ్రోన్ సర్వీస్ సిస్టమ్ అన్నమాట. ఇక అసలు విషయానికి వస్తే కాన్బెర్రాలో వింగ్స్ అనే కంపెనీ డ్రోన్ సర్వీస్ సిస్టమ్ తో తమ కస్టమర్లకు సేవలందిస్తోంది. అయితే ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఈ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అందుకు కారణం కూడా ఉందంటూ ఓ ఉదాహరణను వెల్లడించింది.
కాన్బెర్రాలో బెన్ రాబర్ట్స్ అనే వ్యక్తి కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. యధావిధిగా సదరు కంపెనీ డ్రోన్ ద్వారా కాఫీని సర్వ్ చేస్తోంది. డ్రోన్ కూడా కస్టమర్ ఉండే ప్రాంతానికి సరిగ్గానే వెళుతోంది. కానీ ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ కాకి.. ఆ డ్రోన్ పై దాడి చేసింది. విచిత్రంగా కనిపించిన దాన్ని చూసి. పక్షి అని భ్రమపడిందో ఏమోగానీ, దానిమీద దాడి చేసి, డ్రోన్ ని ఊపేసింది. దీంతో డ్రోన్ తీసుకొస్తున్న కాఫీ కిందపడిపోయింది. అయితే సదరు వింగ్ కంపెనీ మరో డ్రోన్ ద్వారా కస్టమర్ కి కాఫీ అయితే సర్వ్ చేసేసింది. కానీ ఇకపై కొన్ని ప్రాంతాల్లో డ్రోన్ సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సీజన్ లో పక్షులు గుడ్లు పెట్టే సమయం కావడం… పక్షులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో డ్రోన్ సర్వీసు చేస్తే, పక్షులకు ఇబ్బందులు వస్తాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వింగ్స్ కంపెనీ ప్రకటించింది.
ఇవీ చదవండి..