రాబోయే గుండెజబ్బులకు చర్మం లోనే సిగ్నల్.

    0
    721

    గుండెజబ్బు, గుండెపోటు.. ఇలా నిరంతరం గుండె జబ్బులు ఉన్నవాళ్లు బాధపడుతుంటే, లేనివాళ్లు తమకు హార్ట్ అటాక్ వస్తుందేమోననని నిరంతరం భయపడుతుంటారు. ముఖ్యంగా 40 ఏళ్ళకు వయసు పైబడ్డ వాళ్లలో , ఒత్తిడికి గురయ్యే వాళ్లలో , షుగర్ పేషేంట్లలో నిరంతరం గుండె జబ్బుల భయం వెంటాడుతుంది. గుండె జబ్బు లేకపోయినా అది వస్తుందేమోనన్న భయమే , చాలామందికి నిద్రలేకుండా చేస్తోంది..

    గుండెజబ్బులకు నిశ్శబ్ద కారకురాలు కొలెస్టరాల్.. శరీరంలో ఎక్కువకాలం పాటు కొలెస్ట్రాల్ స్థాయి అధికంగావుంటే అది గుండెజబ్బుకు ఒక కారణం అవుతుంది. అయితే , రక్తంలో కొలెస్టరాల్ పెరుగుదలకు శరీరం ఎటువంటి సంకేతాలు ఇవ్వదు. రొటీన్ పరీక్షలలోగానీ , డాక్టర్ అనుమానంతో టెస్ట్ రాస్తే తప్ప , శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినా , మనకు సంకేతాలేమీ ఉండవు. అయితే ఇప్పుడు అమెరికన్ డెర్మటాలజి అసోసియేషన్ రక్తంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్ స్థాయిని పేషేంట్లే సులభంగా కనుక్కొని టెస్ట్ చేయించుకోవచ్చునని చెబుతున్నారు.

    కాళ్ళు , కీళ్లు , చేతి మణికట్టు , ముక్కుచుట్టూ శరీరంలో ఎక్కడైనా చిన్న గడ్డలు , మెత్తగాఉండి , తాకితే అటూఇటూ కదులుతూ నొప్పిలేకుండాఉంటే శరీరంలో కొలెస్టరాల్ శాతం పెరిగిందని అనుమానించాలని చెప్పారు. కళ్ళ కింద, కనురెప్పల మీద చర్మం రంగు మారే తీరు కూడా ఇందుకు ఒక సంకేతమని చెప్పారు. చర్మం కూడా రాబోయే గుండెజబ్బులకు ఒక సిగ్నల్ ఇస్తుందని చెప్పారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.