విచిత్ర తీర్పుల జడ్జీని పక్కన పెట్టారు..

    0
    203

    ఒక అత్యాచారం కేసులో నిందితుడికి బెయిల్ ఇస్తూ ఆరు నెల‌ల పాటు ఆ గ్రామంలో మ‌హిళ‌ల దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేయాల‌ని చెబుతూ బెయిల్ కండిష‌న్ పెట్టిన అవినాష్ కుమార్ అనే జడ్జిని విధుల నుంచి త‌ప్పించారు. బీహార్ లోని మ‌ధుబ‌ని జిల్లా జాంజిహ‌ర్ పూర్ అడిష‌న‌ల్ జిల్లా జ‌డ్జి విచిత్ర‌మైన తీర్పులు ఇవ్వ‌డంలో సిద్ధ‌హ‌స్తుడిగా పేరు గడించాడు. నిందితుల‌కు బెయిల్ మంజూరు చేసేట‌ప్పుడు ఆయ‌న ఇలాంటి విచిత్ర‌మైన కండిష‌న్లు పెడుతుంటాడు. పురాణ‌కాలంలో, పునాత‌న‌కాలంలో ఇలాంటి ఆదేశాలను గ్రామ పెద్ద‌లు ఇచ్చేవాళ్ళు. ఈ నెల‌లోనే రేష‌న్ బియ్యంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డ ఇద్ద‌రు డీల‌ర్ల‌కు బెయిల్ ఇస్తూ, ఊళ్ళో పేద‌లంద‌రికీ ఉచితంగా ఒక‌నెల పాటు బియ్యం, ప‌ప్పు ధాన్యాలు ఇవ్వ‌మ‌ని ఆదేశించారు.

    ఒక బేల్దారి మేస్త్రీ వ‌ద్ద అక్ర‌మంగా తుపాకీ ఉండ‌డంతో ఆ కేసు కింద అత‌నికి బెయిల్ ఇస్తూ గ్రామంలోని దేవాల‌యంలో ఉచితంగా ఒక‌నెల రోజుల పాటు ప‌ని చేయ‌మ‌ని ఆదేశించాడు. పాల‌వ్యాపారం చేసే ఇద్ద‌రు ఓ వ్య‌క్తిపై దాడి చేసిన కేసులో వారిద్ద‌రికీ బెయిల్ ఇస్తూ, ఊళ్ళో పేద పిల్ల‌ల‌కు వారం రోజుల పాటు అర లీట‌రు చొప్పున పాలు ఇవ్వ‌మ‌ని ఆదేశించాడు. కాల‌నీలో చీటికిమాటికీ త‌గాదాలు ప‌డుతున్న ఓ ఆక‌తాయిని ఒక నెల రోజుల పాటు మురికికాల్వ‌లు శుభ్రం చేయ‌మ‌ని ఆదేశాలిచ్చాడు. ఇలాంటి విచిత్ర‌మైన కండీష‌న్ల‌తో బెయిల్ ఇస్తున్న అవినాష్ ను న్యాయ‌ప‌ర‌మైన విధుల నుంచి పాట్నా హైకోర్టు ప‌క్క‌కు త‌ప్పించింది.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.