ఆ త‌ప్పు చేశా రాహుల్ గాంధీకి దూర‌మ‌య్యా..

  0
  555

  రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాను ఓ తప్పు చేశానని, అదే తనను పార్టీకి దూరం చేసిందని శాండిల్ వుడ్ బ్యూటీ రమ్య ఆవేద‌న వ్య‌క్తం చేసింది. సినీ ఇండ‌స్ట్రీలో బీజీగా ఉన్న స‌మ‌యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన ర‌మ్య‌, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమ ఇన్ చార్జ్ గా వ్య‌వ‌హ‌రించింది. మాండ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన రమ్య, ఆపై రాహుల్ గాంధీ కోటరీలో చేరింది. ‘దివ్య స్పందన’ పేరిట ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన ఆమె, కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నేతలపై ఎప్పటికప్పుడు విమర్శలు కూడా చేసింది. ఆ త‌ర్వాత కొన్నాళ్ళ‌కు కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేశారు. అయితే, రాహుల్ విషయంలో చేసిన తప్పేంటన్న విషయాన్ని మాత్రం వెల్లడించకుండా స‌స్పెన్స్ లో పెట్టేసింది ర‌మ్య‌.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.