పెళ్లికాక ముందే ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్..

  0
  868

  సినిమా ఇండస్ట్రీలో పెళ్లి, పెటాకులు మామూలే.. సహజీవనాలు, వీడిపోవడాలు కూడా మామూలే.. లవర్లను మార్చడం కూడా ఇంకా సాధారణమే.. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రముఖ నటి మెహర్రీన్ పిర్జాదా మార్చి నెలలో జరిగిన నిశ్చితార్ధం రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్.. మనుమడు భవ్య బిష్నాయ్ తో ఈమెకు మార్చి నెలలో నిశ్చితార్ధం జరిగింది. అయితే ఇప్పుడు దానిని రద్దు చేసుకుని.. పెళ్లిని కూడా రద్దు చేసినట్టు ప్రకటించింది. రెండు కుటుంబాలు, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయని, ఇక నుంచి.. భవ్య బిష్నాయ్ తో గానీ.. అతని కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తనకు ఎటువంటి సంభందం లేదని చెప్పింది. తన వ్యక్తిగత వ్యవహారాలను అభిమానులు గౌరవించాలని.. దీనిపై చర్చలు జరపవద్దని కోరింది. భవిష్యత్తులో మంచి సినిమాలు చేస్తానని.. తన దృష్టంతా సినిమాలపైనే నని కూడా చెప్పుకొచ్చింది. మెహర్రీన్ ప్రస్తుతం F3 మూవీలో నటిస్తోంది.
  కృష్ణగాడి వీర ప్రేమగాధ, F2లోనూ నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.