టీటీడీ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు..

    0
    173

    తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందిన అర్చకులకు కూడా తిరిగి స్వామివారి కైంకర్యాలు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈమేరకు టీటీడీ ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఉత్తర్వులతో రమణ దీక్షితులు సహా పలువురు అర్చకులకు అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా రమణ దీక్షితులు.. తిరిగి టీటీడీ ప్రధాన అర్చకులుగా విధుల్లో చేరబోతున్నారు.

    టీటీడీలో అర్చకుల పదవీ విరణపై గత పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2018, మే 15న అర్చకుల పదవీ విరమణ వయస్సును నిర్ధారించి, అది దాటిన వారంతా పదవీ విరమణ చేయాల్సింది ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు రమణ దీక్షితులు సహా నలుగురు ప్రధాన అర్చకులు మరికొంత మంది అర్చకులు పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. తర్వాతి కాలంలోనూ అదే కొనసాగింది.

    అయితే అప్పటి పాలక మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2018లో అర్చకులు కోర్టును ఆశ్రయించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న అర్చకులకు వయస్సు మళ్లినప్పటికీ విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పు చెప్పింది. అయితే వయోభారం కారణంగా స్వామివారి కైంకర్యాలు చేయలేరనే ఉద్దేశంతో పాలక మండలి కోర్టు తీర్పును అమలు చేయలేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడిన పాలకమండలి హైకోర్టు ఉత్తర్వులను అమలులోకి తెచ్చింది.

    ఇవీ చదవండి

    మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

    మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

    నౌకను చంద్రుడు కదిలించాడు..

    బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..