కరోనా వ్యాక్సిన్ వేసుకునే వారు మందు తాగచ్చా ? ఈ అనుమానం మద్యపాన ప్రియులను చాలాకాలంగా సంకటానికి గురి చేస్తోంది. కొంతమంది అయితే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే మద్యం తీసుకోకూడదేమో అన్న ఉద్దేశ్యంతో అసలు వ్యాక్సిన్ వేసుకోవడమే మానేశారు. ఇలాంటి సంశయం మందు బాబులకే ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ళు దాటిన వారు వ్యాక్సిన్ వేసుకోవాలని చెబుతుండడంతో ఇది మరింత ఆలోచనలో పడేసింది.
అయితే కరోనా వ్యాక్సిన్ వేసుకునే ముందుగానీ, తర్వాతగానీ మద్యం తీసుకోకూడదన్న నిబంధన ఏదీ లేదని, ఆల్కహాల్ తీసుకున్నంత తర్వాత కరోనా వ్యాక్సిన్ పని చేయదన్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని వివిధ సర్వేలు నిర్ధారించాయి. కాకపోతే కరోనా తీసుకున్న రోజు మాత్రం మందు తాగకపోవడం మంచిది కాదని సలహా ఇచ్చాయి. అమెరికాలోని సెంటర్ ఫర్ డీసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గానీ, బ్రిటన్ లోని పబ్లిక్ హెల్త్ శాఖ గానీ, ఎంహెచ్ఆర్ఏ గానీ, మన ప్రభుత్వ మార్గదర్శకాల్లో గానీ, వ్యాక్సిన్ తీసుకుంటే తాగకూడదన్న నిబంధన ఏదీ లేదు. ఇప్పటివరకు 141 దేశాల్లో 58 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రపంచంలో ఉన్న డాక్టర్లు కూడా కోరనా యాంటీ బాడీస్ ఉత్పత్తి కావడానికి, ఆల్కహాల్ తీసుకోవడానికి సంబంధం లేదని తేల్చారు.
https://ndnnews.in/supermoon-helped-ship-to-float/
https://ndnnews.in/ram-charan-reaction-on-vakeel-saab-trailer/
https://ndnnews.in/2bride-elopes-cheating-on-5-grooms/