నౌకను చంద్రుడు కదిలించాడు..

  0
  1115

  ఆకాశంలో చందమామ పుణ్యమా అని ప్రపంచ వాణిజ్యరంగం ఊపిరి పీల్చుకుంది. చందమామకు , వ్యాపారానికి సంబంధం ఏమిటని ఆశ్చర్య పోవద్దు. సూయిజ్ కాలువలో చిక్కిపోయిన రెండున్నర లక్షల టన్నుల నౌక ఎలా బయటపడిందో తెలుసా..? కేవలం చందమామ పుణ్యమే . నౌకను మళ్ళీ కాలువలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలకు పున్నమి చంద్రుడు తోడయ్యాడు.

  పౌర్ణమి , అమావాస్య రోజుల్లో సముద్రం ఆటుపోట్లు కారణంగా , అలల ఉదృతి తీవ్రంగా ఉంటుంది. ఈ నౌక పున్నమిరోజు నాటి సముద్రం అలలకు కదలడం మొదలుపెట్టింది. దీనికి ఇతర యంత్రాల సాయం తోడైంది. సముద్రం నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఈ నౌక కాలువలో చిక్కుకుంది. సముద్రం , ముఖభాగం , కాలువకు సమీపంలోనే ఉండటంతో , సముద్రంలో అలల ఉదృతికూడా , నౌకను బలంగానే తాకింది. దాని ప్రభావంగానే నౌక కదిలింది..

   

  ఒక పెళ్లికూతురుకి , ఐదుగురు పెళ్లికొడుకులు..

  బరువు తగ్గే మాత్ర – ఇది వాడితే పరలోక యాత్రే.

  చేపల కూరలో స్లోపాయిజన్ పెట్టిన అల్లుడు..

  ఓ జైన యువతి సన్యాసినిగా మారే ముందు , అలంకరణతో చివరిసారిగా వీడ్కోలు..