ఫ్లిప్ కార్ట్ లో బంపర్ ఆఫర్లు..

  0
  360

  ఈ కామర్స్ సంస్థలు, ఆన్ లైన్ సేల్స్ చేసే సంస్థలు స్పెషల్ ఆఫర్లు ప్రకటించకూడదని కేంద్రం ఆదేశాలు ఇచ్చినా ఫ్లిప్ కార్ట్ సంస్థ స్పెషల్ సేల్ ని కొనసాగిస్తోంది. ‘బ్యాక్‌ టు కాలేజ్‌’ గ్యాడ్జెట్స్‌ కార్నివాల్‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్‌ జూన్‌ 21న ప్రారంభమై 24తో ముగుస్తుంది. ప్రత్యేక సేల్‌లో టాప్‌ బ్రాండ్లకు చెందిన గ్యాడ్జెట్లపై 80శాతం వరకు తగ్గింపును ఇస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్‌ కార్డులపై ఫ్లిప్‌ కార్ట్‌ 10 శాతం తగ్గింపును అందిస్తోంది. ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

  ముఖ్యంగా కళాశాల విద్యార్థులకు అవసరమైన ఎలక్ట్రానిక్స్‌ వస్తువులపై తగ్గింపును ప్రకటించింది.
  వెరిఫైడ్‌ స్టూడెంట్స్‌ కు ఫ్లిప్‌కార్ట్‌ ఫ్లాట్‌ రూ.750 తగ్గింపును కూడా అందిస్తోంది. బోట్‌, వన్‌ ప్లస్‌, జేబీఎల్‌, రియల్‌ మీ, ఫిలిప్స్‌ వంటి ఇతర ప్రముఖ బ్రాండ్లకు చెందిన బ్లూటూత్‌ హెడ్‌ ఫోన్లపై 60 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. ఎంపిక చేసిన కంపెనీలకు చెందిన ఇయర్‌బడ్స్‌, హెడ్‌ఫోన్లపై 80శాతం డిస్కౌంట్‌ ఉంది. టాబ్లెట్లు, గేమింగ్‌ మానిటర్లపై 45శాతం తగ్గింపు ప్రకటించింది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..