ఎగిరిన పావురమా.. ? ఎక్కడున్నావో ..చెప్పుమా ..

  0
  551

  ప్రపంచంలో ఎన్నో వింతలు .. ఇంకెన్నో విచిత్రాలు.. ఇప్పుడు తప్పిపోయిన పందెం పావురాల కోసం యజమానులు ఆందోళనలో ఉన్నారు. పందెం కోసం పావురాలను పెంచడం చాలా దేశాల్లో ఉంది.. మన దేశంలో కూడా పావురాలను పందెం కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చి పెంచుతారు.

  ఇప్పుడు బ్రిటన్ లోని పీటర్స్ బర్గ్ నుంచి వదిలిన 10 వేల పావురాల్లో 4 వేల పావురాలు మిస్ అయ్యాయి. వీటిని వదిలిన తరువాత అవి 270 కిలోమీటర్లు పోయి , వెనక్కి రావాలి.. ఇదీ పావురాల పందెం. అయితే 4500 పావురాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. అవెక్కడున్నాయో అయోమయంగా ఉంది..

  బహుశా వాతావరణ మార్పుల వల్ల వాటికేమైనా ప్రమాదం జరిగిందేమోనని యజమానులు భయపడుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా , పందెం పావురాలు ఎక్కడైనా వాలివుంటే , వాటిని కాపాడి , వాటి కాలికి ఉన్న రింగ్ లో ఉన్న తమ మొబైల్ నంబర్ కు ఫోన్ చెయ్యాలని విజ్ఞప్తులు చేస్తున్నారు..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..