బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సొంత విమానం కొన్నారు. తన వ్యాపార, పారిశ్రామిక లావాదేవీల కోసం తరచూ ఆయన విమానా ప్రయాణాలను చేయాల్సి ఉంటున్న నేపధ్యంలో, అదీగాక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరిమితంగా విమానాల రాకపోకలు సాగుతోండటం వంటి కారణాల వల్ల ఆయన సొంతంగా ఓ ఫ్లైట్‌నే కొనేశారు. ఎనిమిది సీట్ల సామర్థ్యంతో కూడుకుని ఉన్న ఛార్టెడ్ ఫ్లైట్ అది. పైలెట్, కోపైలెట్ కాకుండా ఒక ఎయిర్ హోస్టెస్ ఇందులో ఉంటారు. ఈ ఛార్టెడ్ ఫ్లైట్‌కు సీఎం రమేష్..ప్రత్యేక పూజలు చేశారు. టెంకాయ కొట్టారు. అనంతరం టేకాఫ్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తోన్నాయి.
2/2 pic.twitter.com/d5gj6FKEBS
— 2024YSRCP (@2024YSRCP) June 27, 2021