అత్తా అల్లుళ్ళ ప్రేమబంధం-ఇద్దరూ లేచిపోయారు.

  0
  74870

  త‌ల్లి-కూతుళ్ళ‌కు ఏ పోరు ఉన్నా, స‌వ‌తి పోరు ఉండ‌కూడ‌దంటారు. కానీ ఇక్క‌డ అలాంటి పోరే వ‌చ్చింది. కూతురి భ‌ర్త‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది త‌ల్లి. అంత‌టితో ఆగ‌కుండా అత‌న్ని లేవ‌దీసుకునిపోయి, రిజిస్ట‌ర్ మ్యారేజ్ కూడా చేసుకుంది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ జిల్లాలోని మ‌ధుబ‌ర్ అనే గ్రామంలో చోటుచేసుకుంది.

   

  క‌న్న‌కూతురికి  ఓ త‌ల్లి, చివ‌రికి స‌వ‌తిలా మారింది. అల్లుడితోనే అక్ర‌మ సంబంధం కొన‌సాగించింది. రెండేళ్ళు గుట్టుగా సాగిన ఈ అనైతిక బంధం గురించి కూతురికి తెలిసిపోయింది. త‌న భ‌ర్త‌తో అక్ర‌మ సంబంధం ఎందుకు పెట్టుకున్నావంటూ నిల‌దీసింది. తల్లీకూతుళ్ళ మ‌ధ్య ఈ వివాదం బాగా ముదిరింది. దీంతో తాను అల్లుడిని వ‌దిలి ఉండ‌లేన‌ని, కావాలంటే నువ్వు వేరే పెళ్ళి చేసుకో అంటూ కూతురికి చెప్పిందా త‌ల్లి.

   

  చివ‌రికి అల్లుడితో మ‌రో ప్రాంతానికి వెళ్ళి రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకుంది. ప‌ది నెల‌ల త‌ర్వాత అత్తాఅల్లుడు స్వ‌గ్రామానికి రావ‌డంతో, కోపోద్రిక్తులైన కుటుంబ‌స‌భ్యులు, గ్రామ‌స్తులు వారిపై దాడి చేశారు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకుని, వారి నుంచి విడిపించి ర‌క్ష‌ణ కోసం పోలీస్ స్టేష‌న్ కి త‌ర‌లించారు. కాగా అత్త‌కి 50 ఏళ్ళు, అల్లుడికి 25 ఏళ్ళు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.