వైఎస్.జ‌గ‌న్ బ‌యోపిక్.టైటిల్ పాత్ర‌లో ప్ర‌తీక్ గాంధీ

  0
  290

  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ‌యోపిక్ తెర‌కెక్క‌బోతోంది. మ‌హి వి రాఘవ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వైఎస్.రాజశేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్ ‘యాత్ర’ పేరిట తెరకెక్కిన విష‌యం తెలిసిందే. తాజాగా వైఎస్ఆర్‌ తనయుడు జగన్ జీవిత ప్రస్థానాన్ని కూడా ఆయనే ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాలో జగన్ పాత్రను గుజ‌రాతీ నటుడు ప్రతీక్ గాంధీ పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

  ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో రాష్ట్రమంతా ప‌ర్య‌టించి, ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకుని… 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌దుంధిభి మోగించారు జ‌గ‌న్. ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఎన్నో ప‌ధ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి త‌న మార్కుని చూపిస్తూ దూసుకెళుతున్నారు. ఇక ఇప్పుడు ఆయ‌న బ‌యోపిక్ ను పాన్ ఇండియా మూవీగా రూపొందించాల‌ని భావిస్తున్నారు. వైఎస్సార్ మరణం, త‌ద‌నంత‌ర ప‌రిణామాలు, గ‌త ఎన్నిక‌ల్లో జగన్ విజయప్రస్థానం, ప్ర‌స్తుత ప‌రిస్థితుల వరకు జ‌గ‌న్ జైత్ర‌యాత్ర‌ను ఈ చిత్రంలో చూపించ‌నున్న‌ట్లు స‌మాచారం.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.