ఆ కీచకులెవరో తెలిసిపోయింది..

  0
  184

  ఆ కీచకులెవరో తెలిసిపోయింది. ఆ రేపిస్టుల్లో ఒకడిని బంగ్లాదేశ్ కి చెందిన రితఫుల్ ఇస్లాం గా గుర్తించారు. అత్యాచారానికి గురైన యువతి కూడా బంగ్లాదేశీయే. వీరంతా ఇప్పుడు భారత్ లోనే ఉన్నారు. అతి పెద్ద మానవ వేట వీరికోసం ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల పోలీసులు వీరికోసం గాలిస్తున్నారు.

  ఈ అత్యాచార ఘటనకు చెందిన వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నలుగురు యువకులు ఓ యువతిని చెరబట్టడం, ఇందుకు మరో యువతి సాయం చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అత్యంత కిరాతకంగా ఆ నలుగురు ఒకరి తర్వాత ఒకరు ఆ యువతిని రేప్ చేస్తారు. ఈ తతంగాన్నంతా మరొకడు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.

  నలుగురు యువకుల దారుణంతోపాటు.. ఆ వీడియోలో ఆ యువకులకు సహాయంగా ఉన్న మరో యువతి కిరాతకం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాటి మహిళగా ఆమెను ఆదుకోవాల్సింది పోయి, యువకులను రెచ్చగొడుతూ పశు ప్రవృత్తిని చాటుకుంది. ఆ యువకులకు అన్ని విధాలుగా సహకరిస్తూ.. ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టింది. ఆమెపై పదేపదే అత్యాచారం చేయమంటూ ప్రోత్సహించింది. ఈ దారుణానికి సంబంధించిన ఫొటోలను అసోం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పోలీసులు వెబ్ సైట్ లో పెట్టారు, వారికోసం గాలింపు మొదలు పెట్టారు. ఆ కిరాతకుల్ని పట్టుకునేందుకు సోషల్ మీడియాలో ఇప్పుడో ఉద్యమమే మొదలైంది. దాని ఫలితంగా ఇప్పుడు ఆ కిరాతకులను గుర్తించగలిగారు. బాధితురాలితోపాటు, వారిలో ఒకడు బంగ్లాదేశ్ వాసులుగా గుర్తించారు. వారి ఆచూకీ తేలాల్సి ఉంది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..