ఉల్లిపాయలతో బ్లాక్ ఫంగస్ వస్తుందా..?

  0
  42

  ఉల్లిపాయలు వాడితే బ్లాక్ ఫంగస్ వస్తుందా..? అసలు బ్లాక్ ఫంగస్ కి ఆనియన్స్ కి సంబంధం ఏంటి..? ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు చూస్తుంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియడంలేదు. గతంలో కరోనాపై వచ్చిన పుకార్లకంటే ఎక్కువగా ఇప్పుడు బ్లాక్ ఫంగస్ పై రూమర్స్ వస్తున్నాయి.

  ఉల్లిపాయలతో బ్లాక్ ఫంగస్..
  ఉల్లిపాయలు నిల్వ ఉంటే.. వాటి పొరలపై నల్లటి పదార్థం పేరుకుపోతుంది. దానికి, బ్లాక్ ఫంగస్ ని ముడిపెట్టి తప్పుడు ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ నల్లటి పదార్థమే బ్లాక్ ఫంగస్ కి మూలకారణం అని, ఉల్లిపాయలతో కూరలు వండేటప్పుడు జాగ్రత్త అనే మెసేజ్ చక్కర్లు కొడుతోంది. పదే పదే ఇలాంటి మెసేజ్ లు ఫార్వార్డ్ కావడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఉల్లిపాయల పొరల్లో నల్లటి పదార్థం కనపడితే వెంటనే వాటిని దూరంగా ఉంచాలని, పడేయాలని కొంతమంది సలహాలిస్తున్నారు.

  అయితే ఇదంతా తప్పుడు ప్రచారమని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కూరగాయలు, వస్తువుల ద్వారా బ్లాక్‌ ఫంగస్‌ రాదని ఆయన స్పష్టం చేశారు. ఉల్లిపాయలపై కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్‌ వల్ల ఏర్పడుతుందని, అది బ్లాక్‌ ఫంగస్‌ కు దారి తీయదని స్పష్టం చేశారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..