మహిళా భక్తులు స్నానాలు చేస్తుంటే ఈ నీచులు..

    0
    6567

    మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే డబ్బుల కోసం దేవాలయ గదుల్లో మహిళా భక్తులు స్నానాలు చేస్తుంటే వీడియోలు తీయించి డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసి చివరకు కటకటాల పాలైన ఘటన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో చోటుచేసుకుంది. ఈ దారుణంలో ఒక టివి ఛానల్ విలేకరి , దళితనాయకుడు కూడా ఉన్నారు. పెద్దాపురం పట్టణంలోని చారిత్రక విశిష్టత కల్గిన
    పాండవుల మెట్టపై సూర్యనారాయణ స్వామిని దర్శించుకుందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తువుంటారు. మెట్టపైనే పోలీస్ శాఖకు సంబంధించిన వైర్లెస్ రిపిటర్ స్టేషన్ కూడా ఉంది అయితే ఈ స్టేషన్లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ ఆలయానికి వచ్చే మహిళల పట్ల తన వక్ర బుద్ధి చూపించాడు…

    ఆలయంలో ఉండే ఓ మైనర్ బాలుడి ద్వారా మహిళలు స్నానాలు చేసి వీడియోలు తీయించి వాటిని ఓ మీడియా ప్రతినిధి, దళిత నాయకుడికి షేర్ చేసాడు. దళిత నాయకుడు ఆలయ నిర్వాహకులను పిలిచి వీడియోలు చూపించి 5లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకుంటే వారి కుటుంబాన్ని రోడ్డుమీదకు లాగి, ఆలయ విశిష్టతను దెబ్బతిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. విషయం రాజమహేంద్రవరంలోని అధికార పార్టీ నేతకు ఆలయ నిర్వాహకులు చెప్పడంతో వారు జిల్లా ఎస్పీతో మాట్లాడి వేదింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

    ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పెద్దాపురం పోలీసులు వైర్లెస్ రిపీట్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఐతి కనకారావు,  దళిత నాయకుడు రొక్కం శ్యాం దయాకర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపి , మైనర్ బాలుడిని జువైనల్ హోమ్ కు తరలించారు. ఆలయాలకు వచ్చే భక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ కనకారావు వ్యహరించిన తీరు అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించిన డిఎస్పీ ఈ కేసుతో సంబంధించిన ఎవ్వరిని వదలబోమని ఆయన తెలిపారు…

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.