సీత పాత్రకు 12 కోట్లు అడిగిన కరీనా ..

  0
  551

  రామాయణంలో సీత పాత్రకు క‌రీనా క‌పూర్ 12 కోట్లు అడుగుతూ చేసిన డిమాండ్ న్యాయ‌మైంది. ఆమెను స‌పోర్ట్ చేస్తున్నాను. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఆమె తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దే. డిమాండ్ చేయ‌డం కూడా స‌బ‌బే … అంటూ క‌రీనాను స‌మ‌ర్ధిస్తూ సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ వ్యాఖ్య‌లు చేసింది. ఇటీవ‌ల క‌రీనాకు పురాణ‌గాధ‌కు సంబంధించి సీత పాత్ర ఆఫ‌ర్ వ‌చ్చింది. ఆ పాత్ర‌లో న‌టించ‌డానికి క‌రీనా 12 కోట్లు డిమాండ్ చేసింది. మామూలు సినిమాలకైతే ఆమె 6 నుంచి 8 కోట్లు డిమాండ్ చేస్తుంది. కానీ ఇది మైథ‌లాజిక‌ల్ మూవీ కావ‌డం, అందుకోసం భారీగా కాల్షీట్లు ఇవ్వాల్సి రావ‌డంతో ఆమె సినిమా నిర్మాత‌ల‌ను 12 కోట్లు డిమాండ్ చేసింది.

  క‌రీనా డిమాండ్ చేసిన రెమ్యూన‌రేష‌న్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. దీనిపై తాప్సీ త‌న‌దైన శైలిలో స్పందించింది. బాలీవుడ్ లో క‌రీనా పెద్ద సూప‌ర్ స్టార్. ఓ సినిమాకు 8 కోట్లు తీసుకునే క‌రీనా, మైథిలాజిక‌ల్ మూవీకి 12 కోట్లు అడ‌గ‌డంలో త‌ప్పేంటి అంటూ ప్ర‌శ్నించింది. హీరోలు త‌మ రెమ్యూన‌రేష‌న్ ను పెంచుకుంటే ప్ర‌శ్నించ‌ని వారంతా, హీరోయిన్లు రెమ్యూన‌రేష‌న్ పెంచి అడిగితే ఎందుకు రాద్దాంతం చేస్తారంటూ నిల‌దీసింది. హీరోల‌తో స‌రి స‌మానంగా హీరోయిన్లు న‌టిస్తున్నార‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని పేర్కొంది. ఈ విష‌యంలో క‌రీనాకు త‌న ఫుల్ స‌పోర్ట్ అంటూ వ్యాఖ్యానించింది..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.