పార్కుల్లో జంతువులు, పక్షులకు వేర్వేరు స్థలాలుంటాయి. అవి వాటి పంజరాలు, లేదా వాటికి కేటాయించిన స్థలాలు దాటి బయటకు రావు. ఒకవేళ వస్తే, తీసుకెళ్లి వాటిని అక్కడే వదిలిపెట్టి వస్తుంటారు సంరక్షకులు. అయితే న్యూజిలాండ్ లోని ఓ పార్క్ లో మాత్రం ఓ పావురం తనకు సంబంధించిన స్థానికి తానే కాపలాగా ఉంటోంది. ఆ పావురం జోలికి కానీ, దానికి కేటాయించిన స్థలం జోలికి కానీ ఎవరూ వెళ్లడానికి లేదు. ఒకవేళ వెళ్లారంటే వారి పని అయిపోయినట్టే. ఆ పావురానికి కేటాయించిన స్థలంపై ఎవరైనా చేయి వేస్తే.. ఎక్కడ ఉన్నా వెంటనే ఆ పక్షి అక్కడికి వచ్చి వాలిపోతుంది. ఆ అడవి పావురం వచ్చి వాలినవెంటనే అక్కడ చేయి తీసేయాల్సిందే. అంతలా అది జనాన్ని భయపెడుతుందనమాట. ఇదిగో ఇక్కడ చూడండి.. పార్కులో పావురం ఉన్న స్థలంలో చేయి పెట్టిన ఓ వ్యక్తికి అది ఎలాంటి షాకిచ్చిందో. ఎక్కడ ఉందో, ఏమో కానీ ఒక్క ఉదుటున వచ్చి అక్కడ వాలింది.
— Unexpected Scenes (@UnexpectedScene) July 12, 2021
ఇవీ చదవండి..