కరొనతో ఓ పైలెట్ 243 రోజుల పోరాటం ..చివరకు..?

    0
    1910

    243 రోజులు క‌రోనాతో అలుపెరుగ‌ని పోరాటం చేసిన ఓ పైల‌ట్ చివ‌ర‌కు ఆ మ‌హ‌మ్మారికి బ‌లైపోయాడు. బ్రిటీష్ ఎయిర్ లైన్స్ కి చెందిన నికోల‌స్ సినాట్ చికాగోకు విమానంలో వెళుతుండ‌గా క‌రోనా బారిన ప‌డ్డాడు. అమెరికాలోని 243 రోజులు క‌రోనా చికిత్స చేశారు. విచిత్రం ఏమిటంటే ఈ 243 రోజులు ఆయ‌న భార్య నికోల‌స్ తోనే ఆస్ప‌త్రిలోనే ఉండిపోయింది. ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న నికోల‌స్ ఎట్ట‌కేల‌కు క‌రోనా నెగెటివ్ వ‌చ్చిన త‌ర్వాత అమెరికా నుంచి డిశ్చార్జి అయ్యి.. త‌న స్వ‌దేశం బ్రిట‌న్ కి వ‌చ్చేశాడు. అప్ప‌టికే బాగా క్షీణించిపోయి ఉన్నాడు. క‌రోనా నెగెటివ్ వ‌చ్చినా నికోల‌స్ ను దాని దుష్ప్ర‌భావాలు వ‌ద‌ల్లేదు.

    గ‌త ఆరు నెల‌లుగా నికోల‌స్ అనారోగ్యంగానే ఉన్నాడు. చివ‌ర‌కు నిన్న చ‌నిపోయాడు. క‌రోనా కార‌ణంగా త‌లెత్తిన దుష్ప్ర‌భావాలే, ఆ త‌ర్వాత నికోల‌స్ ని బ‌లిగొన్నాయ‌ని వైద్యులు తెలిపారు. ఒక్కోద‌ఫా క‌రోనా ఎంత క‌ర్క‌శంగా ఉంటుందో… ఆ వ్యాధితో 243 రోజులు పోరాడిన నికోల‌స్ ఒక ఉదాహ‌ర‌ణ‌. నికోల‌స్ మృతికి బ్రిటీష్ ఎయిర్ వేస్ కూడా ప్ర‌గాఢ సంతాపం ప్ర‌క‌టించింది. క‌రోనాతో జ‌గిరిన యుద్ధంలో గెలిచిన‌ట్లే గెలిచి ఓడిపోయాడ‌ని విచారం వ్య‌క్తం చేసింది. ప్ర‌పంచంలో ఇంత సుదీర్ఘ‌కాలం పాటు పోరాటం చేసింది నికోల‌స్ ఒక్క‌డే. దుర‌దృష్టం… చివ‌రికి ఓడిపోయాడు.

    ఇవీ చదవండి..

    నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

    ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

    అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

    నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..