ఆమె కోడలు కాదు.. ఆ ఇంటికి దేవత

    0
    4944

    తల్లికి అనారోగ్యం ఉంటే కొడుకో.. కొడుక్కి అనారోగ్యం ఉంటే తల్లో లేదా తండ్రో.. భార్యకు అనారోగ్యం ఉంటే.. భర్తో, లేదా భర్త అనారోగ్యంగా ఉంటే భార్యో.. ఇలా ఈ కరోనా కష్టకాలంలో హృదయాల్ని కదిలించే ఎన్నో సన్నివేశాల్ని మనం చూశాం. అయితే కరోనాతో బాధపడుతున్న తన మామను ఓ కోడలు 2 కిలోమీటర్లు వీపుపై మోసుకుని పోయి చికిత్స చేయించింది.

    నిహారికా దాస్ అనే ఈ కోడలు, మామను తన వీపుపై ఎక్కించుకుని వెళ్లి 2 కిలోమీటర్లు నడిచి ఓ ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఈ లోగా యథాప్రకారం మొబైల్ ఉన్నవారంతా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. తులేశ్వర్ దాస్ అనే ఈ వ్యక్తి, అసోంలోని భటిగావ్ లో వక్కల వ్యాపారం చేస్తుంటాడు. గత వారం రోజులుగా కరోనా లక్షణాలతో ఉన్నఫళంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది.ఆ సమయంలో ఇంట్లో కొడుకు కూడా లేడు. పనిమీద బయటకు వెళ్లి సిలిగురిలో ఉండిపోయాడు. కొడుకు లేకపోవడంతో కోడలే ఆయన్ను వీపుపై మోసుకుంటూ వెళ్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది.

    స్థాని ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో 21కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి ఆటోలో తీసుకెళ్లింది. ఆస్పత్రిలో చేర్పించి ఆక్సిజన్ పెట్టించి.. మామతో సెల్ఫీ తీసుకుని భర్తకు పంపించింది కూడా. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పింది.అయితే దురదృష్టం, ఆస్పత్రికి తీసుకెళ్లిన గంటలోనే ఆయన చనిపోయాడు.

    ఇవీ చదవండి..

    నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

    ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

    అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

    నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..