ఫోన్ మాట్లాడుతూ బావిలో పడి 20 గంటలు..

  0
  887

  ఫోన్ మాట్లాడుతుంటే కొంతమందికి ముందూ వెనుక ఏముందో కూడా తెలియదు.. ప్రమాదాలకు గురి అవుతుంటారు. అలాంటిదే ఇది.. చిత్తూరు జిల్లా పలమనేరులో చంద్రశేఖర్ అనే వ్యాపారి ఫోన్ మాట్లాడుతూ బావిలో పడిపోయి , 20 గంటలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎట్టకేలకు బ్రతికి బయటపడ్డాడు. చంద్రశేఖర్ ఊరి బయట డాబాలో భోజనం చేసాడు. ఫోన్ మాట్లాడుతూ పరాకుగా పోతుండగా , డాబా వెనుక నేలబావిలో పడ్డాడు. ఫోన్ కూడా నీళ్లలో పడిపోయింది.

  60 అడుగుల బావిలో 12 అడుగులు నీళ్ళున్నాయి. ఈత రావడంతో ఎట్టకేలకు , బావిలోనే చెట్ల వేర్లు పట్టుకొని ఉండిపోయాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన , కాపాడండి అంటూ కేకలు పెట్టినా , అటువైపు ఎవరూ రాకపోవడంతో ఆయనను పట్టించుకోలేదు. దీంతో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు బావిలోనే ఉండిపోయాడు. చివరకు ఒక పశువుల కాపరి , బావిలో నుంచి కేకలు విని చెప్పడంతో ఫైర్ డిపార్టుమెంట్ సిబ్బంది ఆయనను బయటకు తీశారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.