మీ పేరు నీరజ్ అయితే మీకు పెట్రోల్ ఫ్రీ..

  0
  26

  అథ్లెటిక్స్ విభాగంలో భారత్ కి తొలి ఒలింపిక్ స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా ఒక్కరోజులోనే జాతీయ హీరోగా మారిపోయారు. నీరజ్ పేరు ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. ఇక ఆయనకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, కంపెనీలు ప్రకటించిన నజరానాలకు లెక్కే లేదు. అయితే కేవలం నీరజ్ కే కాదు, నీరజ్ అనే పేరున్న వారికి కూడా బంపర్ ఆఫర్ ప్రకటించింది ఓ పెట్రోల్ బంక్..

  ప్ర‌భుత్వాలు నీరజ్ చోప్రాకు విలువైన బ‌హుమ‌తులు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని కంపెనీలు నీర‌జ్ చోప్రాకు ఖ‌రీదైన బ‌హుమ‌తులు అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే, నీర‌జ్ పేరు ఉన్న వారికి కొన్ని చోట్ల ఉచిత పెట్రోల్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించాయి. గుజ‌రాత్‌ లోని భ‌రూచ్‌ లో ఒ పెట్రోల్ బంకులో ఉచిత పెట్రోల్ ఆఫర్‌ ను ప్ర‌క‌టించారు. ఈరోజు సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఈ ఆఫ‌ర్ అమ‌లులో ఉంటుంది. నీర‌జ్ పేరున్న వ్య‌క్తులు ఐడీ కార్డు చూపి ఉచితంగా పెట్రోల్‌ పొంద‌వ‌చ్చు. జునాగ‌డ్‌ లోని గిర్నార్ రోప్‌ వే కంపెనీ నీర‌జ్ పేరున్న వ్య‌క్తులు ఉచితంగా రోప్‌ వేలో ప్ర‌యాణం చేసే అవ‌కాశం క‌ల్పించింది. ఈ అవ‌కాశం ఆగ‌స్ట్ 20 వ‌ర‌కు ఉంటుంద‌ని ఆ సంస్థ తెలియ‌జేసింది.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..