మీరు గ్రామ సింహాలు.. మీరు వరాహ సమానులు..

    0
    274

    నువ్వు సన్నాసివి అంటే, నువ్వు నాకంటే పెద్ద సన్నాసివంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రి పేర్ని నాని విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరీ అంత మోటుగా తిట్టుకుంటే బాగోలేదనుకున్నారో ఏమో.. గ్రాంథిక భాషలోకి దిగి తమ భాషా పాండిత్యాన్ని చాటుకుంటున్నారు ఇద్దరు నేతలు. ముందుగా పవన్ కల్యాణ్ గ్రామసింహాలంటూ.. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.

    ‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే’’ అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. దీంతో పాటు ‘హూ లెట్ ద డాగ్స్ ఔట్స‌ అనే పాటను ట్వీట్ చేస్తూ.. ఇది తనకు ఇష్టమైన పాటల్లో ఒకటిగా ప‌వ‌న్‌ పేర్కొన్నారు.

    దీనికి అంతే ధీటుగా బదులిచ్చారు మంత్రి పేర్ని నాని. ‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు’ అని ట్వీట్ చేశారు. అలాగే పవన్ కల్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోనూ పోస్ట్ చేశారు. దీంతో వీడియోకు వీడియో, ట్వీట్‌కు ట్వీట్‌…అన్నీ లెక్క‌లు స‌రిపెట్టిన‌ట్టైంది.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.