బద్వేల్ మే సవాల్.. ఉప ఎన్నికకు షెడ్యూల్

    0
    720

    ఏపీలో బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికకు కూడా ఒకేసారి షెడ్యూల్ ఇచ్చింది. మొత్తం దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించింది సీఈసీ.

    ముఖ్యమైన తేదీలు..
    ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల: అక్టోబర్‌ 1
    నామినేషన్ల దాఖలుకు తుది గడువు : అక్టోబర్‌ 8
    నామినేషన్ల పరిశీలన: అక్టోబర్‌ 11
    నామినేషన్ల ఉపసంహరణ గడువు: అక్టోబర్‌ 13
    పోలింగ్‌ తేదీ: అక్టోబర్‌ 30
    ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల: నవంబర్‌ 2

    బద్వేల్ నియోజకవర్గంలో అధికార వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానానికి సుబ్బయ్య భార్య సుధ వైసీపీ తరపున బరిలో ఉండగా టీడీపీ తరపున ఓబులాపురం రాజశేఖర్ బరిలో నిలబడబోతున్నారు. ఇక బీజేపీ, జనసేన ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

    తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక జరుగుతోంది. టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరిన రాజేందర్ ఆ పార్టీ తరపున బరిలో దిగుతారు. అధికార టీఆర్ఎస్ పార్టీ గెల్లు శ్రీనివాస్ ని రంగంలోకి దింపుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.