కళ్ళముందే వాగులో బస్సు కొట్టుకుపోయింది..

  0
  2935

  మ‌హారాష్ట్ర‌ని భారీవ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో న‌దుల‌న్నీ పొంగి పొర్లుతున్నాయి. ఎక్క‌డ చూసిన వ‌ర‌ద‌లు క‌నిపిస్తున్నాయి. ప్ర‌యాణాల‌కు కూడా వీలులేని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అయితే ఓ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఓ బ‌స్సు వ‌ర‌ద‌నీటిలో కొట్టుకుపోయింది. య‌వ‌త్మాల్ జిల్లా ఉమ‌ర్ ఖేడ్ లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వ‌ర్షాల కార‌ణంగా ఉమ‌ర్ ఖేడ్ లో వ‌ర‌ద‌లు పోటెత్తుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌లు కూడా జారీచేసింది.

  ఇలాంటి స‌మ‌యంలో ఎంతో బాధ్య‌త‌తో వ్య‌వ‌హరించాల్సిన ఓ డ్రైవ‌ర్‌, ప్ర‌భుత్వ బ‌స్సును న‌డుపుతూ, లో లెవ‌ల్ వంత‌న‌పైకి పోనిచ్చాడు. నీటి ప్ర‌వాహం ఉధృతంగా ఉన్నా ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించాడు. వంతెన‌కు మ‌రోవైపు ఉన్న‌కొంద‌రు, డ్రైవ‌ర్ ను వారిస్తున్నా ప‌ట్టించుకోకుండా వంత‌న‌పై వంద మీట‌ర్ల ముందుకు దూసుకొచ్చాడు. అయితే వ‌ర‌ద ఉధృతి మ‌రింత పెర‌గ‌డంతో బ‌స్సు నీటిలో కొట్టుకుపోయింది. డ్రైవ‌ర్,కండెక్ట‌ర్ తో పాటు ఐదుమంది ఈ వ‌ర‌ద ప్ర‌మాదంలో కొట్టుకుపోయారు. ఒడ్డున ఉన్న‌వారు కాపాడాల‌ని చేసిన ప్ర‌యత్నాలు కూడా విఫ‌ల‌మ‌య్యాయి.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.