రెడ్లు , రెడ్లు మీరే తేల్చుకోండి.. పవన్

  0
  576

  సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన రిప‌బ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ పొలిటిక‌ల్ గా హాట్ స‌బ్జెక్ట్ అయింది. తాను సినిమాల ప్రోగ్రెస్ లో ఉన్నందువ‌ల్లే ఆంధ్రాలో సినిమా థియేట‌ర్లు ఓపెన్ చేయకుండా ప్ర‌భుత్వం అడ్డుకుంటోంద‌ని ఆరోపించారు. వేదిక ముందున్న దిల్ రాజును ఉద్దేశించి, దిల్ రాజు నువ్వు రెడ్డివ‌ని జ‌గ‌న్ కి తెలియ‌దు, మీరు రెడ్డి-రెడ్డి తేల్చుకోండ‌య్యా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రెడ్లు-రెడ్లు తేల్చుకుంటే ప‌రిష్కారం అవుతుందేమో చూద్దామ‌న్నారు. నువ్వు నాతో వ‌కీల్ సాబ్ తీయ‌డం వ‌ల్లే ఈ గొడ‌వంతా వ‌చ్చింద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ద్ద నిధులు లేక‌పోవ‌డం వ‌ల్లే ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్లు అమ్మి, ఆ మొత్తాన్ని ప్ర‌భుత్వం వాడుకోవాల‌ని చూస్తోంద‌న్నారు.

  ముఖ్య‌మంత్రిని సినిమా ప‌రిశ్ర‌మ విష‌య‌మై క‌లిసిన చిరంజీవిపై చాలా సోద‌ర భావం ఉంద‌ని, ఓ స‌న్నాసి మంత్రి అన్నాడ‌ని, ఆ సన్నాసోడికి నిజం తెలుసున‌ని అన్నారు. చిరంజీవి మంచి మ‌న‌సున్న వ్య‌క్తి కాబ‌ట్టి బ‌తిమాలుకుంటార‌ని ప‌వ‌న్ అన్నారు. జ‌గ‌న్ రెడ్డి, మోహ‌న్ బాబుకు కూడా బంధువ‌ని, అందువ‌ల్ల సినిమా క‌ష్టాల గురించి మోహ‌న్ బాబు కూడా జ‌గ‌న్ తో మాట్లాడాల‌ని సూచించారు. ప్ర‌కాష్ రాజ్ మా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంటే నాన్ లోక‌ల్ అంటూ ప్ర‌చారం చేయ‌డం కూడా మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఇలా ఇబ్బంది పెట్ట‌డం మంచి సంప్ర‌దాయం కాద‌ని, కుర్రాళ్ళు కామెడీ చంపేస్తార‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.